Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాణించిన రుతురాజ్‌ – తడబడిన సీఎస్కే

ముంబై విజయలక్ష్యం 157

దుబాయ్‌ : ఐపీఎల్‌ రెండో దశలో భాగంగా దుబాయ్‌ ఇంటర్నేషల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే తడబడిరది. కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకోగా మొదటి ఓవర్‌ నుంచే వికెట్ల పతనం ప్రారంభమైంది. ఒక దశలో రెండు పరుగులకు రెండు వికెట్లు పడిపోయాయి. డుప్లెసిస్‌, మొయీన్‌ అలీ డకౌట్‌ కాగా, రైనా నాలుగు, ధోనీ 3 పరుగులు చేసి అవుటయ్యారు. అంబటి రాయుడు పరుగులేమీ చేయకుండానే దురదృష్టవశాత్తు రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ మాత్రం క్రీజులో కుదురుకుని అద్భుతంగా షాట్లు ఆడాడు. రుతురాజ్‌ 58 బంతుల్లో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడి స్కోరులో నాలుగు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు ఉన్నాయి. అతడికి మరోవైపు రవీంద్ర జడేజా (26`33 బంతుల్లో) అండగా నిలవడంతో స్కోరు వంద పరుగులైనా దాటింది. చివరిలో జడేజా బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌ చేతికి చిక్కడంతో క్రీజులోకి వచ్చిన బ్రావో చెలరేగాడు. కేవలం 8 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లున్నాయి. 20 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌కు 157 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబై ఇండియన్స్‌ బౌలర్లలో బౌల్ట్‌, మిల్నే, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు.
పొలార్డ్‌ సారథ్యం
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌కు కీరన్‌ పొలార్డ్‌ సారథ్యం వహించాడు. రోహిత్‌ బాగానే ఉన్నాడని, తాను ఈ ఒక్క మ్యాచ్‌కే కెప్టెన్‌గా ఉంటానని పొలార్డ్‌ పేర్కొన్నాడు. రోహిత్‌ ఈ మ్యాచ్‌ను మిస్సవుతున్నాడని, హార్దిక్‌ ఆడడం లేదని చెప్పాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img