Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రాణించిన రోహిత్‌

అర్ధసెంచరీ చేసిన శర్మ
రాహుల్‌, పంత్‌, పాండ్య మెరుపులు
అఫ్గానిస్థాన్‌ లక్ష్యం 211

అబుదాబి : వరుస రెండు ఓటములతో డీలాపడ్డ భారత్‌ గురువారం అఫ్గానిస్థాన్‌లో జరిగిన మ్యాచ్‌లో పూర్వవైభవాన్ని దక్కించుకుంది. టాపార్డర్‌ సమష్ఠిగా రాణించి అఫ్గానిస్థాన్‌ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (74, 4I8, 3I6)లతో అర్ధసెంచరీ చేసి జట్టును పటిష్ఠ స్థితిలో నిలిపాడు. దీనికి రాహుల్‌, పంత్‌, పాండ్య కూడా సహకరించారు. టోర్నీలో అత్యంత కీలకమైన మ్యాచ్‌ బుధవారం అబుదాబి వేదికగా భారత్‌`అఫ్గానిస్థాన్‌ మధ్య జరిగింది. రెండు జట్లకు అత్యంత కీలకమైన ఈ మ్యాచ్‌లో భారత్‌ మళ్లీ టాస్‌ ఓడిపోయింది. టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ నబీ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అయితే అందరూ ఊహించినట్టు ముజీబురెహ్మాన్‌ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. మిగిలిన టీంతోనే నబీ రంగంలోకి దిగాడు. మరోవైపు టాస్‌ ఓడిపోయిన కోహ్లి జట్టులో రెండు మార్పులు చేశాడు. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి స్థానంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ జట్టులోకి వచ్చారు.
భారత్‌ ఇన్నింగ్స్‌ను కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ ధాటిగా ప్రారంభించారు. రోహిత్‌ వస్తూనే ఫోర్లతో విరుచుకుపడ్డాడు. మరోవైపు రాహుల్‌ కూడా తన బ్యాట్‌కు పనిచెప్పాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలోనే టీమిండియా స్కోరు 23 దాటింది. వీరిద్దరూ కలిసి స్కోరు బోర్డును ఊరకలెత్తించారు. మరోవైపు ఈ జోడీని విడగొట్టేందుకు నబీ ప్రయత్నిస్తుండగా, రోహిత్‌ శర్మ ఫోర్లతో బౌలర్లను బెంబేలెత్తించ సాగాడు. ఈక్రమంలో ఐదో ఓవర్‌ నాలుగో బంతిని నవీన్‌ వేయగా, దాన్ని రోహిత్‌ సిక్స్‌గా మలిచాడు. దీంతో పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 53 పరుగులు దాటింది. వీరిద్దరూ కలిసి ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. రెండు మ్మాచ్‌లలో అనూహ్య ఓటమి చెందడంతో బ్యాట్స్‌మెన్‌ పట్టుదలగా ఆడుతూ స్కోరు బోర్డు పెంచసాగారు. వీరిద్దరినీ విడగొట్టేందుకు నబీ పలు ప్రయత్నాలు చేశాడు. ఏ ప్రయత్నం ఫలించలేదు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమ యానికి టీమిండియా స్కోరు 85 పరుగులకు చేరుకుంది. ఈక్రమంలోనే రోహిత్‌ ఫోర్‌తో తన అర్ధసెంచరీకి చేరుకున్నాడు. 7 ఫోర్లు, ఒక సిక్స్‌లో రోహిత్‌ ఈ ఫీట్‌ను అందుకు న్నాడు. మరోవైపు రాహుల్‌ కూడా బంతిని బౌండరీకి తరలించి తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ అర్ధసెంచరీలో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఓవర్లు అయిపోయేందుకు దగ్గర పడుతున్న కొద్దీ వీరిద్దరూ ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. అయితే ఓ భారీ షాట్‌కు యత్నించిన రోహిత్‌ శర్మ (74, 47 బంతులు 4I8, 6I3) కరీమ్‌ జనత్‌ బౌలింగ్‌లో అఫ్గానిస్థాన్‌ కెప్టెన్‌ నబీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 140 పరుగుల వద్ద టీమిండియా మొదటి వికెట్‌ కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్‌ రావడంతోనే దూకుడుగా ఇన్నింగ్స్‌ ప్రారంభించాడు. అయితే 15.4 ఓవర్‌ వద్ద ఎల్‌బీడబ్ల్యూ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. వికెట్ల వెనుకకు బాల్‌ను పంపుదామనుకున్న రాహుల్‌ను గుల్బద్దీన్‌ బోల్తా కొట్టాంచాడు. బౌల్డ్‌ రూపంలో రాహుల్‌ పెవిలియన్‌కు చేరాడు. మొత్తంగా 48 బంతుల్లో 4I6, 2I6లతో 69 పరుగులు చేశాడు. ఇటువంటి తరుణంలో రిషబ్‌పంత్‌ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. గుల్బద్దీన్‌ బౌలింగ్‌లో బ్యాక్‌ టు బ్యాక్‌ సిక్సర్‌లు కొట్టి స్కోరు బోర్డు పరుగులు పెట్టించాడు. హార్దిక్‌ పాండ్య కూడా తన బ్యాట్‌ను రaుళిపించాడున. బ్యాక్‌ టు బ్యాక్‌ ఫోర్లు కొట్టాడు. వీరిద్దరూ కలిసి ఫోర్లు, సిక్సులతో చెలరేగారు. పంత్‌ 13 బంతుల్లో 1I4, 3I6లతో 27 పరగులు చేసి నాటౌట్‌గా నిలవగా, హార్దిక్‌ పాండ్య 13 బంతుల్లో 4I4, 2I6లతో 35 పరుగులు చేసి అజేయంగా నిలబడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్టు కోల్పోయి 210 పరుగులు చేసింది. అఫ్గానిస్థాన్‌ బౌలింగ్‌లో గుల్బద్దీన్‌కు ఒకటి, జన్నత్‌కు ఒక వికెట్‌ దక్కాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img