Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాహుల్‌ ఔట్‌.. సూర్యకుమార్‌ ఇన్‌..!

కివీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు జట్టు ప్రకటన
రోహిత్‌, కోహ్లి, పంత్‌లకు విశ్రాంతి
రెండో టెస్టుకు అందుబాటులో విరాట్‌
టెస్టుల్లో శ్రేయస్‌ అయ్యర్‌ అరంగేట్రం..?

ముంబై: న్యూజిలాండ్‌ జట్టుతో టీమిండియా టెస్ట్‌ సిరీస్‌ను ఆరంభించనుంది. రెండు టెస్టుల సిరీస్‌ ఇది. మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను ఏకపక్షంగా ముగించేసింది భారత జట్టు. 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక టెస్టుల్లోనూ అదే తరహా దూకుడును ప్రదర్శించడానికి సమాయాత్తమౌతోంది. దీనికోసం నెట్స్‌లో కఠోరంగా శ్రమిస్తోంది. మరోవంక న్యూజిలాండ్‌ పరిస్థితి కూడా ఇంతే. టీ20 సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైన బ్లాక్‌ క్యాప్స్‌.. ప్రతీకారం కోసం కాచుకుని కూర్చుంది. టెస్టుల్లో న్యూజిలాండ్‌ జట్టు నంబర్‌ వన్‌ హోదాలో కొనసాగుతోంది.
టీమిండియాకు బ్యాడ్‌న్యూస్‌..
ఈ పరిస్థితుల్లో భారత క్రికెట్‌ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. డాషింగ్‌ ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయపడ్డాడు. అతని ఎడమ తొడ కండరాల్లో గాయమైంది. దీనితో అతను టెస్ట్‌ సిరీస్‌ మొత్తానికీ దూరం అయ్యాడు. రెండు టెస్టుల్లోనూ అతను ఆడట్లేదు. జవవరిలో కీలకమైన దక్షిణాఫ్రికా పర్యటన ఉన్న నేపథ్యంలో- కేఎల్‌ రాహుల్‌ను బెంగళూరులోని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి పంపించాలని భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నిర్ణ యం తీసుకుంది. ఎన్సీఏలోని రిహాబిలిటేషన్‌కు తరలించనుంది.
కోలుకుంటేనే..
భారత క్రికెట్‌ జట్టు జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనకు బయలుదేరి వెళ్లనుంది. ఇందులో కూడా కేఎల్‌ రాహుల్‌కు చోటు దక్కడం అనుమానమేననే అభిప్రాయాలు వ్యక్తమౌ తున్నాయి. పూర్తిస్థాయి ఫిట్‌నెస్‌ను అతను సాధించగలిగితేనే దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపిక అవుతాడు. లేదంటే.. విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అతన్ని వదులుకోవడానికి బీసీసీఐ ఇష్ట పడట్లేదు. అందుకోసమే- అతన్ని నేషనల్‌ క్రికెట్‌ అకాడమీకి వీలైనంత త్వరగా రిపోర్ట్‌ చేయాలని సూచించింది.
సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు..
కేఎల్‌ రాహుల్‌ గాయపడిన నేపథ్యంలో- అతని స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది బీసీసీఐ. ఈ మేరకు సెలెక్షన్‌ కమిటీ ఓ ప్రకటన విడుదల చేసింది. గాయపడ్డ కేఎల్‌ రాహుల్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు కల్పించినట్లు స్పష్టం చేసింది. టీ20 స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా పేరుంది సూర్యకుమార్‌ యాదవ్‌కు. టెస్టుల్లో సుదీర్ఘమైన ఇన్నింగ్‌ ఆడే సత్తా, ఓపిక అతనికి ఉందా? అనేది అనుమానమే. అది ఈ టెస్ట్‌ సిరీస్‌తో తేలిపోతుంది.
ఇప్పటికే రోహిత్‌, విరాట్‌ దూరం..
ఇప్పటికే మరో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ న్యూజిలాండ్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు దూరం అయ్యాడు. అతను విశ్రాంతి కోసం ఈ సిరీస్‌ను స్కిప్‌ చేశాడు. తొలి టెస్టులో విరాట్‌ కోహ్లి కూడా ఆడట్లేదు. రెండో టెస్ట్‌కు మాత్రం అతను అందుబాటులో ఉంటాడు. ఈ పరిస్థితుల్లో మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా దూరం కావడం వల్ల- ఓపెనింగ్‌ సమస్య ఎదురైనట్టే. దీన్ని ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. శుభ్‌మన్‌ గిల్‌తో కలిసి జట్టు ఇన్నింగ్‌ను కేఎల్‌ రాహుల్‌ ఆరంభించాల్సి ఉంది. అతని స్థానం వృద్ధిమాన్‌ సాహాను ఆడిరచవచ్చు.
తొలి టెస్ట్‌.. టీమ్‌ ఇదే..
న్యూజిలాండ్‌తో తొలి టెస్ట్‌ రేపటి నుంచి ఆరంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌ స్టేడియం దీనికి వేదికగా మారింది. శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, చేతేశ్వర్‌ పుజారా, శ్రేయాస్‌ అయ్యర్‌, అజింక్య రహానె (కెప్టెన్‌), కేఎస్‌ భరత్‌, వృద్ధిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ సిరాజ్‌ను టెస్ట్‌ స్క్వాడ్‌గా ఎంపిక చేసింది బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img