Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రూట్‌కు బుమ్రానే కరెక్ట్‌

లండన్‌: భారత్‌`ఇగ్లాండ్‌ టెస్టు క్రికెట్‌ సిరీస్‌లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను అవుట్‌ చేసేందుకు టీమిండియా బౌలర్లు చెమటోడుస్తున్నారు. అయితే, అతడిని ఎలా ఔట్‌ చేయొచ్చో ఆ జట్టు మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్‌ చెప్పేశాడు. ఈ మేరకు టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి కీలక సూచన చేశాడు. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అజేయంగా 180 పరుగులు చేసిన రూట్‌, రెండో ఇన్నింగ్స్‌లో 33 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఈ టెస్టులో ఇండియా 151 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న రూట్‌ను అవుట్‌ చేయాలంటే.. అతడు క్రీజులోకి రాగానే వెంటనే బుమ్రా చేతికి బంతి ఇవ్వవాలని కోహ్లీకి పనేసర్‌ సూచించాడు. ఫిప్త్‌ స్టంప్‌లైన్‌లో ఆఫ్‌స్టంప్‌కు ఆవల బంతిని విసిరిన బుమ్రా ఇంగ్లండ్‌ కెప్టెన్‌ను ఔట్‌ చేశాని పేర్కొన్నాడు. కోహ్లీ చెప్పిన ప్లాన్‌ను బుమ్రా చక్కగా అమలు చేశాడని ప్రశంసించాడు. తర్వాత కూడా విరాట్‌ ఇలానే చేయాలని, రూట్‌ క్రీజులోకి రాగానే బుమ్రా చేతికి బంతి అందివ్వాలని పనేసర్‌ సూచించాడు. రూట్‌ షార్ట్‌ బాల్స్‌ను చక్కగా ఆడతాడని, కాబట్టి అతడికి షార్ట్‌ పిచ్‌ బంతులు వేయొద్దని పనేసర్‌ సూచించాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img