Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

రెజ్లింగ్‌లో నిరాశ

టోక్యో: ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ పోటీలు మొదలయ్యాయి. అచ్చొచ్చిన ఈ క్రీడలో భారత్‌కు శుభారంభమైతే దక్కలేదు. మహిళల 62 కిలోల విభా గంలో యువ రెజ్లర్‌ సోనమ్‌ మాలిక్‌ తొలిరౌండ్లో ఓటమి పాలైంది. గెలవా ల్సిన మ్యాచును అతి రక్షణాత్మకంగా ఆడి చేజార్చుకుంది. మంగోలియాకు చెందిన బొలొర్తుయా ఖురెలుతో 19 ఏళ్ల సోనమ్‌ తలపడిరది. తొలి మూడు నిమిషాల్లోనే ఆమె 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత దూకుడు తగ్గించి రక్షణాత్మక విధానం ఎంచుకుంది. అదే ఆమె కొంప ముంచింది. ఆట మరో 35 సెకన్లలో ముగుస్తుందనగా ఆసియా రజత పతక విజేతైన బొలొర్తుయా.. సోనమ్‌ను (టేక్‌ డౌన్‌) ఎత్తిపడేసింది. దాంతో స్కోరు 2-2తో సమమైంది. ఆఖరి పాయింట్‌ చేసింది మంగోలియన్‌ కాబట్టి న్యాయనిర్ణేతలు ఆమెనే విజేతగా ప్రకటించారు. ఈ మ్యాచ్‌ ముగిసిన తర్వాత బొలొర్తుయా బల్గేరియాకు చెందిన తయెబ్‌ ముస్తఫా యూసెన్‌తో తలపడి ఓటమి పాలైంది. దాంతో ఇక సోనమ్‌కు రెపిచేజ్‌ అవకాశం లేకుండా పోయింది. ‘మంగోలియన్‌తో పోలిస్తే సోనమ్‌ మెరుగైన రెజ్లరే. అతి రక్షణాత్మకంగా ఆడి పొరపాటు చేసింది. ఏదేమైనప్పటికీ ఆమెకు అత్యున్నత క్రీడల్లో తలపడ్డ అనుభవం వచ్చింది’ అని ఆమె కోచ్‌ అజ్మెర్‌ మాలిక్‌ అన్నారు. సోనమ్‌కు ఇదే తొలి ఒలింపిక్స్‌ కావడం గమనార్హం. ఆమె 2017, 2019లో క్యాడెట్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం రవి దహియా (75 కిలోలు), దీపక్‌ పునియా (86 కిలోలు), అన్షు మాలిక్‌ (57 కిలోలు) బరిలోకి దిగనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img