Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

లాన్‌ బౌల్స్‌లో భారత్‌ చారిత్రక ప్రదర్శన

బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ఇప్పటివరకు వచ్చిన ఆరు పతకాలు కేవలం వెయిట్‌ లిఫ్టింగ్‌లో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లాన్‌ బౌల్స్‌ క్రీడలో భారత్‌కు రజతం లేదా స్వర్ణం వచ్చే అవకాశం ఉంది. మహిళల ఫోర్స్‌ లాన్‌ బౌల్స్‌ జట్టు సెమీఫైనల్లో న్యూజిలాండ్‌ను 16-13తో ఓడిరచింది. తద్వారా లాన్‌ బౌల్స్‌ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ క్రీడలో తొలిసారి భారత్‌ పతకం సాధించబోతుండడం గమనార్హం. మహిళల ఫోర్స్‌ లాన్‌ బౌల్స్‌ జట్టులో లవ్లీ చౌబే ఆధిక్యం ప్రదర్శించగా, పింకీ రెండో స్థానంలో, నయన్మోని సైకియా తృతీయ స్థానంలో, రూపా రాణి టిర్కీ స్కిప్‌ పొజిషన్లతో ఆకట్టుకున్నారు. వీరి ప్రదర్శనతో భారత ఖాతాలో కనీసం రజత పతకమైనా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్‌ గెలిచిన అనంతరం లాన్‌ బాల్స్‌ కోచింగ్‌ స్టాఫ్‌ సంబరాలు చేసుకున్నారు. ఒకవేళ ఫైనల్‌లో గెలిస్తే భారత్‌కు స్వర్ణం కూడా దక్కొచ్చు. ఇక ఆదివారం జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో నార్ఫోక్‌ ఐలాండ్‌ను ఓడిరచి లాన్‌ బౌల్స్‌ పోటీలో మహిళల ఫోర్స్‌ జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img