Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు

రషీద్‌ఖాన్‌ రికార్డు బద్దలు కొట్టిన నేపాల్‌ బౌలర్‌ లిమిచానే

ఖాట్మండు: నేపాల్‌ యువ బౌలర్‌ వన్డేల్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. లెగ్‌ స్పిన్నర్‌ సందీప్‌ లమిచానే వన్డేల్లో వేగంగా 100 వికెట్లు పడగొట్టాడు. 22 ఏళ్ల సందీప్‌ 42 మ్యాచుల్లోనే ఈ ఫీట్‌ సాధించడం విశేషం. దాంతో, అఫ్గానిస్థాన్‌ టీ20 కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉన్న ఐదేళ్ల రికార్డును బద్దలు కొట్టాడు. ఏసీసీ మెన్స్‌ ప్రీమియర్‌ కప్‌లో ఒమన్‌ జట్టుపై సందీప్‌ ఈ ఘనతకు చేరువయ్యాడు. రషీద్‌ 44 వన్డేల్లో 100 వికెట్లు తీశాడు. అతను 2018లో ఈ ఘనత సాధించగా అప్పటి నుంచి ఆ రికార్డు రషీద్‌ పేరు మీదే ఉంది. వన్డేల్లో వేగంగా 100 వికెట్లు తీసి సందీస్‌ దిగ్గజాలను దాటేశాడు. లెజెండరీ బౌలర్లకు ఈ ఫీట్‌ సాధించడానికి ఎన్ని మ్యాచ్‌లు పట్టిందో చూద్దాం. ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్కార్ట్‌ 52 మ్యాచుల్లో ఈ ఫీట్‌ సాధించాడు. పాకిస్తాన్‌ మాజీ స్పిన్నర్‌ సక్లెయిన్‌ ముస్తాక్‌ 53 వన్డేల్లో వంద వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌ దిగ్గజం షేన్‌బాండ్‌, బంగ్లాదేశ్‌ ఫాస్ట్‌ బౌలర్‌ ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 54 మ్యాచుల్లో వంద వికెట్ల క్లబ్‌లో చేరారు. క్రికెట్‌ ఆటతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌పై గత ఏడాది చెరగని మచ్చ పడిరది. దాంతో అతని కెరీర్‌ ప్రమాదంలో పడిరది. అందుకు కారణం.. అతడు లైంగిక దాడి ఆరోపణల కేసులో జైలుకు వెళ్లాడు. దాంతో, అతడిపై నేపాల్‌ క్రికెట్‌ నిషేధం విధించింది. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో సందీప్‌పై నిషేధాన్ని ఎత్తి వేసింది. కానీ, కేసు మాత్రం నడుస్తూనే ఉంది. సందీప్‌ లమిచానే ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. 2018 నుంచి 2020 వరకు దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే… ఆడిరది మాత్రం 9 మ్యాచులే. 2018లో ఆరు వికెట్లు, 2019లో 13 వికెట్లు పడగొట్టాడు. 2020లో దిల్లీ జట్టు కూర్పు సరిపోవడంతో ఈ లెగ్‌ స్పిన్నర్‌కు అవకాశం రాలేదు. అప్పటి నుంచి అతను ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img