Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వన్డే జట్టులో బుమ్రా…లంక సిరీస్‌కు ఎంపిక

ముంబై:
టీమిండియా అభిమానులకు శుభవార్త. కొన్నాళ్లుగా క్రికెట్‌కి దూరంగా ఉన్న జస్ప్రిత్‌ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేశాడు. ఆసియా కప్‌ 2022 టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్‌ బుమ్రా… తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత ంండంటే రెండు మ్యాచులు ఆడి తిరిగి గాయపడ్డాడు. వెన్నుగాయంతో టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టోర్నీకి కూడా దూరంగా ఉన్న జస్ప్రిత్‌ బుమ్రా… శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్‌ ద్వారా మళ్లీ బంతి చేతబట్టనున్నాడు. జస్ప్రిత్‌ బుమ్రాని శ్రీలంకతో వన్డే సిరీస్‌కి ఎంపిక చేసిన జట్టులో చేరుస్తున్నట్టు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. వెన్ను గాయానికి చికిత్స చేయించుకున్న జస్ప్రిత్‌ బుమ్రా, పూర్తి ఫిట్‌నెస్‌ సాధించినట్టుగా జాతీయ క్రికెట్‌ అకాడమీ క్లియరెన్స్‌ ఇచ్చింది. దీంతో తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోబోతున్నాడు జస్ప్రిత్‌ బుమ్రా. గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో వన్డే, టెస్టు సిరీస్‌కి దూరమైన మహ్మద్‌ షమీ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్‌ ద్వారా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. షమీ, బుమ్రాలతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ ఫాస్ట్‌ బౌలర్లుగా ఎంపికయ్యారు. బుమ్రా రాకతో ఉమ్రాన్‌ మాలిక్‌ రిజర్వు బెంచ్‌కి పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీకి ఎంపిక చేసిన 20 మంది కోర్‌ టీమ్‌ని ఎక్కువ మ్యాచులు ఆడిరచాలని జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. భారత్‌`శ్రీలంక వన్డే సిరీస్‌ జనవరి 10 నుంచి మొదలవుతుంది. 10న గౌహతిలో తొలి వన్డే, 12న కోల్‌కత్తాలో రెండో వన్డే, 15న తిరువనంతపురంలో మూడో వన్డే జరగనుంది.
శ్రీలంక సిరీస్‌కు భారత్‌ జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, కెఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్ధిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, యజ్వేంద్ర చాహాల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img