Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వరుణ్‌ను మిస్‌ చేసుకోవడం ఇంకా బాధిస్తూనే ఉంది: ఫ్లెమింగ్‌


చెన్నై: కోల్‌కతా స్పిన్నర్‌పై చెన్నై సూపర్‌కింగ్స్‌ హెడ్‌ కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్‌లో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై జట్టుపై కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించగా…. ఇందులో రెండు వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి గురించి ఫ్లెమింగ్‌ స్పందిస్తూ… అతడు తమను గతంలో నెట్స్‌లో ఇబ్బందులకు గురి చేశాడని గుర్తు చేసుకున్నాడు. వరుణ్‌ చక్రవర్తి చెన్నైకి కొంతకాలం నెట్‌ బౌలర్‌గా సేవలందించాడు. కాగా అతడిని వేలంలో దక్కించుకోలేకపోయామని, అది ఇంకా మమల్ని బాధకు గురి చేస్తూనే ఉందని ఫ్లెమింగ్‌ తెలిపాడు. ధోనీతోపాటు సీఎస్కే బ్యాటర్లను సుడులు తిరిగే బంతులతో ఇబ్బందులకు గురిచేసేవాడని అన్నాడు. ‘వరుణ్‌ను మిస్‌ చేసుకోవడం ఇంకా బాధిస్తూనే ఉంది. వేలంలో అతడిని దక్కించుకోలేకపోయాం. తమిళనాడు ఆటగాడైన అతడికి ఇక్కడి పరిస్థితులు బాగా తెలుసు. నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు అతడి టాలెంట్‌ చూసి అబ్బురపడ్డాం. ఇక అతడు ఈ మ్యాచ్‌లో బాగా బౌలింగ్‌ చేశాడు’ అని ఫ్లెమింగ్‌ మెచ్చుకున్నాడు. ఈ మ్యాచ్‌లో పరిస్థితులను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతోనే చెన్నై ఓడిపోయిందని వివరించాడు. 2019 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు జరిగిన వేలంలో కింగ్స్‌ ఎక్స్‌ఐ పంజాబ్‌ (ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌) వరుణ్‌ చక్రవర్తిని రూ.8.4 కోట్లకు దక్కించుకుంది. 2019 సీజన్‌లో ఈ మిస్టరీ స్పిన్నర్‌ ఒకే మ్యాచ్‌ ఆడాడు. తన తొలి ఓవరోనే 25 పరుగులు సమర్పించుకున్నాడు. 2020 సీజన్‌కు ముందు వరుణ్‌ చక్రవర్తిని పంజాబ్‌ జట్టు నుంచి రిలీజ్‌ చేసింది. 2020 వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ అతడిని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి కేకేఆర్‌ తరపునే ఆడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 19 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img