లండన్ : వింబుల్డన్ బాలుర విభాగం టైటిల్ను ఇండో అమెరికన్ సమీర్ బెనర్జీ దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో విక్టర్ లిలోవ్పై 7-5, 6-3తో సమీర్ విజయం సాధించాడు. అంతకుముందు.. సెమీస్లో గీమార్ట్ వేయన్బర్గ్పై సమీర్ విజయం ఢంకా మోగించాడు. 2014 తర్వాత ఓ ఇండో అమెరికన్ ఆటగాడు టైటిల్ దక్కించుకోవటం ఇది మొదటిసారి. 1997 తర్వాత ఇది రెండోసారి.