Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

విదేశీ కోచ్‌లకే ప్రాధాన్యం

ఈ ఒలింపిక్స్‌లో ప్రయోగం సక్సెస్‌ – భారత బృందానికి వెన్నెముకగా నిలిచిన సపోర్టింగ్‌ స్టాఫ్‌

న్యూదిల్లీ : భారత అథ్లెట్లు-ప్లేయర్లు నీరజ్‌ చోప్రా, పీవీ సింధు, లవ్లీనా, మీరాబాయ్‌ ఛాను, రవి దహియా, భజరంగ్‌ పూనియా, మన్‌ప్రీత్‌ సింగ్‌ నేతృత్వంలోని పురుషుల హాకీ టీం, రాణి రాంపాల్‌ నేతృత్వంలోని మహిళా హాకీ టీం.. టోక్యో 2020 ఒలింపిక్స్‌లో ప్రముఖంగా నిలిచిన వీళ్లం దరికీ ఉన్న ఒకే కామన్‌ పాయింట్‌.. అంతా విదేశీ కోచ్‌ల ఆధ్వర్యంలో సత్తా చాటినవాళ్లే. వీళ్ల ఘనత వల్ల స్వదేశీ కోచ్‌ల ప్లేసుల్లో ఈసారి విదేశీ కోచ్‌ల పేర్లు ఎక్కువగా తెరపై వినిపించి.. కనిపించాయి. పతకాల మేజర్‌ సక్సెస్‌ రేటు పరదేశీ కోచ్‌లదే అయినా.. స్వదేశీ కోచ్‌ లకు స్థానం దక్కకపోవడంపై విమర్శలు వినిపించాయి.
వీళ్లే టా(తో)ప్‌
విదేశీ కోచ్‌ల్లో ఎక్కువ జీతం అందుకుంది ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం, భారత పురుషుల హాకీ జట్టు కోచ్‌ గ్రాహం రెయిడ్‌. నెలకు 15వేల డాలర్ల జీతం(పదకొండు లక్షలకుపైనే) అందుకున్నా డాయన. ఆ తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్‌ హాకీ లెజెండ్‌ జోయర్డ్‌ మరీన్‌ నెలకు పదివేల డాలర్లు(ఏడున్నర లక్షలపైనే) అందుకున్నారు. ఇక బాక్సింగ్‌ డైరెక్టర్‌ శాంటియాగో నియేవా(అర్జెంటీనా) ఈ లిస్ట్‌లో ఎనిమిది వేల డాలర్ల(దాదాపు ఆరు లక్షలు)తో మూడో ప్లేస్‌ లో నిలవగా, జావె లిన్‌ త్రో కోచ్‌ ఉవే హోన్‌ నెలకు ఎని మిదివేల డాలర్లతో నాలుగో ప్లేస్‌లో, రైఫిల్‌ కోచ్‌లు ఓలెగ్‌ మిఖాయి లోవ్‌-పావెల్‌ స్మిర్‌ నోవ్‌ (రష్యా) చెరో 7,500 డాలర్లు (ఐదున్నర లక్షలు) లతో తర్వాతి స్థానంలో నిలిచారు.
కొత్తేం కాదు
విదేశీ కోచ్‌లను ఆశ్రయించడం మనకేం కొత్త కాదు. అం దులో ఎలాంటి దాప రికమూ లేదు. 80వ దశకం నుంచి అథ్లెటిక్స్‌ ఫెడ రేషన్‌ విదేశాల నుంచి స్పెషలిస్టులను తెప్పించుకోవడం మొదలు పెట్టింది. సిడ్నీ ఒలింపిక్స్‌(2000) టైం నాటికి అది తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా హాకీ, షూటింగ్‌, వెయిట్‌లిఫ్టింగ్‌ లాంటి మేజర్‌ ఈవెంట్లు విదేశీ నిపు ణుల ఆధ్వర్యంలో మెరుగైన ప్రదర్శనకు దారితీయ డంతో ఈ ట్రెండ్‌ కంటిన్యూ అవుతోంది. ప్రము ఖంగా విదేశీ కోచ్‌లకే ఎందుకు ప్రాధాన్యం? అనే ప్రశ్నకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌) నుంచి వివరణ.. సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉండడమే. శాయ్‌ ఎంపిక చేసే కోచ్‌లలో ఎక్కువ మంది గతంలో ఛాంపియన్‌లుగా ఉన్నవాళ్లో లేదంటే విజయాలను అందు కున్న అనుభవం ఉన్నవాళ్లో ఉంటారు. వాళ్లకు మన కోచ్‌లతో పోలిస్తే సైంటిఫిక్‌-టెక్నికల్‌ నాలెడ్జ్‌, ట్రిక్కులు- జిమ్మిక్కులు, డైట్‌కు సంబంధించిన వివరాలపై ఎక్కువ అవగాహన ఉం టుంది. అందుకే కేవలం సలహాల కోసమే ఒక్కో సారి వాళ్లను నియమించుకుంటాయి కూడా. అలాగని మన దగ్గరా సత్తా ఉన్నవాళ్లు లేరని కాదు. ‘సక్సెస్‌తో పాటు అనుభవం’ అనే పాయింట్‌ మీదే ఫారిన్‌ కోచ్‌ లకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది శాయ్‌.
విదేశీకే ప్రయారిటీ
టోక్యో ఒలింపిక్స్‌ కోసం టోక్యోకు వెళ్లిన 126 మంది అథ్లెట్ల కోసం (9 విభాగాలు) 32 మంది విదేశీ కోచ్‌లు పని చేశారు. సక్సెస్‌ జోరు.. ఆటగాళ్లతో ఈ కోచ్‌ల టెంపో కారణంగా మరికొంత కాలం వీళ్లనే కోచ్‌లుగా కొనసాగిం చాలని శాయ్‌ భావి
స్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img