Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

శ్రేయస్‌కు గాయం… భారత్‌కు సమస్యలు మొదలు: చోప్రా

న్యూదిల్లీ: ఆసీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ముందు శ్రేయస్‌ అయ్యర్‌ గాయపడటంతో భారత్‌కు సమస్యలు మొదలయ్యా యని టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. ఈ నెల 9వ తేదీ నుంచి నాగ్‌పుర్‌లో భారత్‌ సేన ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఆకాశ్‌ మాట్లాడుతూ ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ గాయం మరో సమస్యను సృష్టించింది. అతడి స్థానంలో ఎవరిని ఆడిరచాలన్నది భారత్‌కు ఓ సవాల్‌. 5వ స్థానంలో సరిపోయే ఆటగాడు ఎవరైనా రిజర్వులో ఉన్నారా అంటే.. అది సూర్యకుమార్‌ యాదవ్‌. శుభ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లు. వీరిలో రోహిత్‌తో పాటు ఇన్నింగ్స్‌ ప్రారంభించేది ఎవరు..? గతంలో జట్టు ఎంపికను గమనిస్తే.. ద్విశతకం చేసిన ఇషాన్‌ కిషన్‌ను వారు రిజర్వులో కూర్చోబెట్టారు. ఈ లెక్కన శుభమన్‌ గిల్‌ బాగా ఆడుతున్నా.. కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా వెళ్లే అవకాశాలున్నాయి’’ అని చోప్రా వివరించాడు. ‘శుభ్‌మన్‌ కేసు బలమైంది. ఎందుకంటే అతడు బంగ్లాదేశ్‌ సిరీస్‌ నుంచి పరుగులు చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే 2023లో అతడిలా పరుగుల వరద పారించినవారు లేరు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు టెస్ట్‌ క్యాప్‌ ఇవ్వొచ్చని నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను’’ అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు. వెన్నెముక గాయం కారణంగా శ్రేయస్‌ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ నుంచి వైదొలిగాడు. అతడు ఇప్పటికీ పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించలేదు. దీంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌కు శ్రేయస్‌ అందుబాటులో లేడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img