Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సంజూ శ్యాంసన్‌కు జరిమానా

చెన్నై: రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శ్యాంసన్‌కు .. ఐపీఎల్‌ నిర్వాహకులు భారీ జరిమానా విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా అతనికి ఫైన్‌ విధించారు. ఓవర్‌ రేట్‌ విషయంలో ఈ ఏడాది ఐపీఎల్‌లో జరిమానా పడ్డ రెండో కెప్టెన్‌గా శ్యాంసన్‌ నిలిచాడు. ఆర్సీబీ కెప్టెన్‌ డూప్లెసిస్‌కు తొలుత జరిమానా విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్‌లో శ్యాంసన్‌ తొలి తప్పుగా భావిస్తూ.. అతనికి రూ.12 లక్షల జరిమానా విధించారు. జరిమానాపై ఐపీఎల్‌ ఓ ప్రకటన జారీ చేసింది. ఒకవేళ మళ్లీ తప్పు చేస్తే, రెండోసారి రూ.24 లక్షల ఫైన్‌ విధించే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మిగిలిన 10 మంది ఆటగాళ్లపై కూడా ఫైన్‌ వేస్తారు. వారిపై ఆరు లక్షలు లేదా 25 శాతం మ్యాచ్‌ ఫీజును వసూల్‌ చేస్తారు. ఇక ఒక సీజన్‌లో మూడో సారి స్లో ఓవర్‌ రేట్‌ వేస్తే అప్పుడు కెప్టెన్‌కు 30 లక్షల ఫైన్‌ విధిస్తారు. దీనితో పాటు ఒక మ్యాచ్‌పై బ్యాన్‌ వేస్తారు. మరో 10 మంది ఆటగాళ్లపై 12 లక్షల ఫైన్‌ వేస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img