Friday, April 19, 2024
Friday, April 19, 2024

సమరానికి సై

నేటి నుంచి టీ`20 వరల్డ్‌ కప్‌

దుబాయ్‌ : మరో సమరానికి క్రికెట్‌ జట్లు సిద్ధమయ్యాయి. అక్టోబరు 17 నుంచి యూఏఈ, ఒమన్‌ వేదికగా మరో టీ20 ప్రపంచ కప్‌ సమరానికి సిద్ధమైంది. ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఐదేళ్ల విరామం తరువాత ఆదివారం ప్రారంభమయ్యే ఐసీసీ టీ 20 వరల్ట్‌ కప్‌ టోర్నీలో అత్యధికంగా 16 జట్లు పాల్గొంటాయి. ఇప్పటికే వార్మప్‌ మ్యాచ్‌ల కోలాహలం ప్రారంభమైంది. ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌ఏ, గ్రూప్‌బీలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. అనంతరం ప్రధాన జట్ల మధ్య సూపర్‌ 12 స్టేజ్‌ మ్యాచ్‌లు అక్టోబరు 23 నుంచి ప్రారంభమవుతాయి. తొలి గేమ్‌లో ఒమన్‌పపువా న్యూ గినియా జట్లు తలపడతాయి. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌స్కాట్లాండ్‌ను ఢీ కొంటుంది. ఈ క్రికెట్‌ పండుగలో తుది వరకు నిలిచేది ఎవరు? కప్పుఎవరికి సొంతం కానుంది? అనేదానిపై అభిమానుల మధ్య చర్చ జరుగుతోంది. టి 20 వరల్ట్‌ కప్‌లో భారత్‌ గెలుపుకున్న బలాలేంటి? అనేది ఉత్కంఠమైన చర్చ సాగుతోంది. 2007లో టి 20 ప్రపంచకప్‌ను అందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ మెంటార్‌గా ఉండటం భారత్‌ జట్టుకు కలసివచ్చే అంశం. ధోనీ నుంచి కెప్టెన్సీ అందుకున్న విరాట్‌ కోహ్లీకి ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన సుదీర్ఘ అనుభవం ఉంది. దీనితో కచ్చితంగా టి20 ప్రపంచకప్‌ భారత్‌ గెలుస్తుందన్న నమ్మకం ఉంది. ఒమన్‌ వేదికగా ప్రారంభమయ్యే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలు పాల్గొననున్నాయి. భారత జట్టు బలహీనపడినా ఆటగాళ్లలో ధోనీ ధైర్యాన్ని, ఆత్మస్తైర్యాన్ని నింపి నడిపించగల సత్తా ఉందనేది అందరి అభిప్రాయం.
భారత్‌ జట్టు : విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.
రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌. మెంటార్‌: ఎంఎస్‌ ధోని

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img