Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

సిరీస్‌ మనదే!

. చెలరేగిన రోహిత్‌ శర్మ
. 8వికెట్ల తేడాతో ఘనవిజయం
. అర్ధసెంచరీతో రాణించిన రోహిత్‌
. కివీస్‌ను బెంబేలెత్తించిన భారత బౌలర్లు

రాయ్‌పూర్‌ : సొంతగడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఈ ఏడాది వరుసగా రెండో వన్డే సిరీస్‌ కైవసం చేసుకుంది. శనివారం రాయ్‌పూర్‌ వేదికగా ఏకపక్షంగా సాగిన రెండో వన్డేలో భారత్‌ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-0తో మరో మ్యాచ్‌ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. 34.3 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు మహమ్మద్‌ షమీ(3/18), హార్దిక్‌ పాండ్యా(2/16), వాషింగ్టన్‌ సుందర్‌(2/7) విజృంభించడంతో న్యూజిలాండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. గ్లెన్‌ ఫిలిప్స్‌(52 బంతుల్లో 5 ఫోర్లతో 36), మైకేల్‌ బ్రేస్‌వెల్‌(30 బంతుల్లో 4 ఫోర్లతో 22) టాప్‌ స్కోరర్లుగా నిలిచారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 20.1 ఓవర్లలో 2 వికెట్లకు 111 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. రోహిత్‌ శర్మ(50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. శుభ్‌మన్‌ గిల్‌(53 బంతుల్లో 6 ఫోర్లతో 40 నాటౌట్‌) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో షిప్లే, శాంట్నర్‌ తలో వికెట్‌ తీశారు. 108 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ శుభారంభం అందించారు. న్యూజిలాండ్‌ బ్యాటర్లు తడబడిన పిచ్‌పై స్వేచ్ఛగా ఆడారు. రెండో ఓవర్‌లో బౌండరీతో మొదలుపెట్టిన రోహిత్‌, ఫెర్గూసన్‌ వేసిన 5వ ఓవర్‌లో ట్రేడ్‌ మార్క్‌ హుక్‌ షాట్‌తో సిక్సర్‌ కొట్టాడు. మరోవైపు శుభ్‌మన్‌ గిల్‌ ఆచితూచి ఆడినా వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. టిక్‌నర్‌ వేసిన 10వ ఓవర్‌లో రోహిత్‌ వరుసగా 4, 6 బాదగా, రోహిత్‌ కోసం ఓ కుర్రాడు మైదానంలోకి దూసుకొచ్చాడు. దాంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. సెక్యూరిటీ ఆ బాలుడిని లాక్కెళ్లగా, రోహిత్‌ సింగిల్‌తో ఓవర్‌ను ముగించడంతో టీమిండియా పవర్‌ ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఆ తర్వాత మరో రెండో బౌండరీలు బాదిన రోహిత్‌.. శాంట్నర్‌ బౌలింగ్‌లో సింగిల్‌ తీసి 47 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే రోహిత్‌ ఇన్నింగ్స్‌కు షిప్లే తెరదించాడు. ఎల్బీగా పెవిలియన్‌ చేర్చడంతో తొలి వికెట్‌కు నమోదైన 72 పరుగుల భాగస్వామ్యానికి తెరపడిరది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి రెండు బౌండరీలతో జోరు కనబర్చాడు. కానీ మరోసారి శాంట్నర్‌ బౌలింగ్‌లోనే కోమ్లి (11) వెనుదిరిగాడు. శాంట్నర్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమై స్టంపౌటయ్యాడు. క్రీజులోకి వచ్చిన ఇషాన్‌ రెండు బౌండరీలు బాదగా, శుభ్‌మన్‌ విన్నింగ్‌ షాట్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img