Friday, April 19, 2024
Friday, April 19, 2024

సెల్ఫీలకు నిరాకరణ… పృథ్వీషాపై దాడి

న్యూదిల్లీ : టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా దాడికి గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన స్నేహితుడితో కలిసి బుధవారం ఓ హోటల్‌కు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబైలోని ఓషివారా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. తొలుత సెల్ఫీలను తిరస్కరించినందుకు దాడి చేసినట్లు భావించినప్పటికీ.. డబ్బు ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించినట్లు కూడా ఫిర్యాదులో పృథ్వీ షా స్నేహితుడు ఆశిశ్‌ సురేంద్ర పేర్కొన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. సురేంద్రతో కలిసి పృథ్వీ షా శాంతాక్రూజ్‌లోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్లాడు. నిందితులు సెల్ఫీ కోసం పృథ్వీ షా వద్దకు వచ్చారు. అయితే ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు షా ఆసక్తి చూపగా.. గ్రూప్‌లోని మిగతావారు కూడా వచ్చి సెల్ఫీ ఇవ్వాల న్నారు. తాను స్నేహితులతో కలిసి భోజనానికి వచ్చానని, ఇప్పుడు అందరితో సెల్ఫీ ఇవ్వడం కుదరదని పృథ్వీ షా వారికి సమాధానం ఇచ్చాడు. అప్పటికీ ఇవ్వాల్సిం దేనని పట్టుబట్టడంతో షా స్నేహితుడు వెంటనే హోటల్‌ మేనేజర్‌ను పిలిచి ఫిర్యాదు చేశారు. హోటల్‌ నుంచి వెళ్లిపోవాలని నిందితులను మేనేజర్‌ అడగడంతో అదంతా మనసులో పెట్టుకొని.. హోటల్‌ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ షా, అతడి స్నేహితుడి కారుపై బేస్‌బాల్‌ బ్యాట్లతో దాడికి పాల్పడ్డారు. బీఎండబ్ల్యూ కారు వెనుక, ముందర భాగంలోని కిటికీలు ధ్వంసమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటన సమయంలో కారులోనే పృథ్వీ షా ఉన్నాడని.. అయితే దీనిని వివాదం చేయకూడదనే ఉద్దేశంతో అతడిని వేరే కారులో సురక్షితంగా ఇంటికి పంపించినట్లు సురేంద్ర తెలిపారు. అయితే ఓ మహిళ తన కారును వెంబడిరచి మరీ జోగేశ్వరి లోటస్‌ పెట్రోల్‌ పంప్‌ దగ్గర ఆపేసిందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img