Friday, April 19, 2024
Friday, April 19, 2024

‘స్వర్ణం’పై గురి

జావెలిన్‌ త్రో ఫైనల్స్‌లో నీరజ్‌
రెజ్లింగ్‌లో రవికుమార్‌ దహియా
హాకీలో కాంస్యం కోసం పోరు

టోక్యో: జపాన్‌ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న టోక్యో ఒలింపిక్స్‌లో 13వ రోజు.. భారత్‌కు సుదినం. అయితే రెజ్లింగ్‌, హాకీ ఈవెంట్లలో స్వర్ణం తృటిలో తప్పింది. ఇక బాక్సింగ్‌లో లవ్లీనా కాంస్య పతకం సాధించింది.
జావెలిన్‌ థ్రో ఫైనల్స్‌కు ఫస్ట్‌టైమ్‌..
ఒలింపిక్స్‌ చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా భారత్‌.. పురుషుల జావెలిన్‌ థ్రో విభాగంలో ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇదో నయా రికార్డ్‌. ఇప్పటిదాకా ఏ త్రోయర్‌ కూడా ఈ ఘనతను సాధించలేదు. అలాంటి అసాధారణ కార్యక్రమాన్ని అవలీలగా పూర్తి చేశాడు భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా. క్వాలిఫికేషన్స్‌ రౌండ్‌లో దుమ్ము దులిపాడు. తొలి ప్రయత్నంలోనే అతను ఏకంగా 86.65 మీటర్ల దూరం వరకు జావెలిన్‌ను సంధించాడు. ఈ విభాగంలో పాయింట్ల పట్టికలో నీరజ్‌ చోప్రా తొలి స్థానంలో నిలిచాడు. ఇదీ రికార్డే.
అంచనాల్లేకుండా బరిలోకి..
ఇది అనూహ్యం. ఏ మాత్రం అంచనాలు లేకుండా.. ఒత్తిడికి అందకుండా.. దానికి లొంగకుండా నీరజ్‌ చోప్రా బరిలోకి దిగాడు. విసరడం..విసరడంతోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు. ఫస్ట్‌ అటెంప్ట్‌లోనే అతను రికార్డ్‌ స్థాయి దూరానికి జావెలిన్‌ను సంధించాడు. గ్రూప్‌-ఏ విభాగంలో అతనే టాపర్‌. భారత్‌ను తొలి స్థానంలో నిలిపాడు.
7న ఫైనల్స్‌..
నీరజ్‌ చోప్రా ఏకంగా 86.65 మీటర్లకు పైగా జావెలిన్‌ను సంధించడంతో ఆటోమేటిక్‌గా అతను ఫైనల్స్‌కు అర్హత సాధించినట్టయింది. ఈ కేటగిరీలో భారత్‌ అగ్రస్థానంలో నిలవగా.. జర్మనీ, ఫిన్లాండ్‌ రెండు, మూడు స్థానాలను ఆక్రమించాయి. కాగా ఫైనల్‌ ఈవెంట్‌ ఈనెల 7వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు పురుషుల ఉంటుంది.
రెజ్లింగ్‌లో..
పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్‌ రెజ్లింగ్‌లో ఓటమి ఎరుగని రవికుమార్‌ దహియా ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. తొలుత 1/8 ఫైనల్‌ రౌండ్‌లో విజయం సాధించాడు. అనంతరం క్వార్టర్‌ ఫైనల్స్‌, ఆ తరువాత సెమీ ఫైనల్స్‌లో తనకు తిరుగులేదనిపించుకున్నాడు. అతను ఫైనల్స్‌ ఎంట్రీ ఇవ్వడంతో పతకం ఖాయమైంది. గురువారం అతను ఫైనల్‌ బౌట్‌ ఆడాల్సి ఉంది. రవి దహియా సాధించిన ఈ విజయంతో భారత పతకాల సంఖ్య నాలుగుకు పెరిగింది. అదే సమయంలో రవి దహియాతో పాటు దండయాత్రను ప్రారంభించిన మరో రెజ్లర్‌ దీపక్‌ పునియా అనూహ్యంగా ఓటమిని చవి చూశాడు. సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయాడు. అతని జైత్రయాత్రకు సెమీ ఫైనల్‌లో అడ్డుకట్ట పడిరది. అమెరికా రెజ్లర్‌ డేవిడ్‌ టేలర్‌.. పునియా జోరును అడ్డుకున్నాడు. సెమీ ఫైనల్స్‌లో ఓడిరచాడు. ఒకరకంగా ఈ బౌట్‌ మొత్తం కూడా ఏకపక్షంగా సాగింది. డేవిడ్‌ టేలర్‌ ఆధిపత్యం ప్రదర్శించాడు. అన్ని బౌట్లలోనూ దీపక్‌ పునియా తిరుగులేని విజయాలను సాధిస్తూ వచ్చాడు. తొలుత 1/8 ఫైనల్‌ రౌండ్‌లో నైజీరియాకు చెందిన ఎకెరెకెమె అగియోమోర్‌ను ఓడిరచాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగు పెట్టాడు. ఆ తరువాత క్వార్టర్‌ ఫైనల్స్‌ లో చైనాకు చెందిన లిన్‌ రaుషెన్‌ను ఓడిరచాడు ఈ మ్యాచ్‌లో 6-3 పాయింట్లతో పునియా సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. అక్కడ కూడా అదే దూకుడును కొనసాగిస్తాడని భారతీయులు ఆశించారు.. ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అదే సమయంలో రవి కుమార్‌ దహియా సెమీ ఫైనల్స్‌లో ఘన విజయం సాధించి, పతకాన్ని ఖాయం చేసుకోవడంతో ఇక దీపక్‌ పునియా కూడా అదే రేంజ్‌లో చెలరేగిపోతాడని అంచనా వేశారు. అందరి అంచనాలను తలకిందులు చేశాడు పునియా. గెలిచి తీరాల్సిన బౌట్‌లో అంచనాలకు అనుగుణంగా సత్తా చాటలేకపోయాడు. పరాజయాన్ని చవి చూశాడు. అమెరికన్‌ రెజ్లర్‌ డేవిడ్‌ టేలర్‌ చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. దీనితో అతని జైత్రయాత్రకు సెమీ ఫైనల్‌లో అడ్డుకట్ట పడినట్టయింది.
హాకీలో తప్పని ఓటమి.. కాంస్యంపై పోరు
భారత మహిళల హాకీ టీమ్‌ కల చెదిరింది. ఒలింపిక్స్‌ చరిత్రలోనే అద్భుత ఆటతో తొలిసారి ఫైనల్‌కు చేరిన భారత మహిళల టీమ్‌ తృటిలో ఫైనల్‌కు చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. బుధవారం ఉత్కంఠగా సాగిన సెమీఫైనల్లో వరల్డ్‌ 9వ ర్యాంకర్‌ భారత్‌ 1-2 తేడాతో వరల్డ్‌ నెంబర్‌ 2 అర్జెంటీనా చేతిలో పోరాడి ఓడిరది. చివరి క్వార్టర్‌కు పోరాడిన భారత అమ్మాయిలను వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేక మూల్యం చెల్లించుకున్నారు. మ్యాచ్‌ మొత్తంలో అధిక మొత్తంలో పెనాల్టీ కార్నర్స్‌ ఇచ్చుకున్న భారత అమ్మాయిలు ఓటమికి తలవంచారు. భారత తరపున గుర్జిత్‌ కౌర్‌(2వ నిమిషం) ఏకైక గోల్‌ చేయగా.. అర్జెంటీనా కెప్టెన్‌ మారియా బారినోవా(18వ, 36వ నిమిషం) డబుల్‌ గోల్స్‌ భారత పతనాన్ని శాసించింది. బ్రాంజ్‌ ఫైట్‌లో భారత అమ్మాయిలు గ్రేట్‌ బ్రిటన్‌తో
తలపడనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img