Monday, December 5, 2022
Monday, December 5, 2022

10వేల మీటర్ల రేస్‌వాక్‌లో అమిత్‌కు రజతం

ప్రపంచ అండర్‌`20 అథ్లెటిక్స్‌

నైరోబీ : నైరోబీ వేదికగా జరుగుతున్న ప్రపంచ అండర్‌20 అథ్లెటిక్స్‌లో భారత్‌ ఖాతాలో రజతం చేరింది. 10 వేల మీటర్ల రేస్‌వాక్‌లో అమిత్‌ రజతం సొంతం చేసుకున్నాడు. రేస్‌ను 42 నిమిషాల 17.94 సెకెన్లలో పూర్తి చేసిన అమిత్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇక రేస్‌ను 42 నిమిషాల 10.84 సెకన్లలో పూర్తి చేసిన కెన్యాకు చెందిన హెరిస్టోన్‌ వాన్‌యోన్యి స్వర్ణం సాధించాడు. స్పెయిన్‌ అథ్లెట్‌ పాల్‌ మెగ్రాత్‌ మూడో స్థానంలో నిలిచాడు. 17 ఏళ్ల అమిత్‌ ఈ ఏడాది మొదట్లో జరిగిన జాతీయ ఫెడరేషన్‌ కప్‌ పోటీల్లో రేస్‌ను 40 నిమిషాల్లోనే పూర్తి చేసి జాతీయ రికార్డును నెలకొల్పాడు. రేస్‌ దారి ఎత్తుగా ఉండడంతో ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డానని, అయినా పోటీ పడిన తొలి అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లోనే రజతం సాధించడం సంతోషంగా ఉందని అమిత్‌ తెలిపాడు. రేస్‌వాక్‌లో పతకం సాధించడం భారత్‌కు ఇదే తొలిసారి కాగా, ఒకే అథ్లెటిక్స్‌ మీట్‌లో రెండు పతాకాలు సాధించడం కూడా భారత్‌కు ఇదే తొలిసారి కావడం గమనార్హం. అథ్లెటిక్స్‌ మీట్‌ తొలి భాగంలో భారత్‌ 4400 రిలేలో కాంస్య పతకం సాధించి విషయం తెలిసిందే. మొత్తంగా ప్రపంచ అండర్‌20 అథ్లెటిక్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం. నీరజ్‌ చోప్రా, హిమదాస్‌, సీమా అంతిల్‌, నవజీత్‌ కౌర్‌ దిల్లోన్‌ భారత్‌కు అండర్‌20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో పతకాలు అందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img