Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

వన్డేల్లో ‘టాప్‌’లేపిన బుమ్రా

అత్యుత్తమ బ్యాటర్‌గా సూర్యకుమార్‌ యాదవ్‌

ముంబై: వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, న్యూజిలాండ్‌ స్టార్‌ బౌలర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ను వెనక్కి నెట్టి నంబర్‌ 1ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక టీ20 బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ టాప్‌ 5 ర్యాంకుకు చేరుకున్నాడు. అలాగే ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో మెరిసిన భువనేశ్వర్‌ కుమార్‌ టీ20 టాప్‌-10బౌలర్ల లిస్టులో 8వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇకపోతే వన్డేల్లో టాప్‌ 10బౌలర్ల నుంచి ఇండియా తరపున ఉన్న ఏకైక బౌలర్‌ బుమ్రా కాగా.. టీ20ల్లో టాప్‌ 10ర్యాంకింగ్స్‌లో ఇండియా తరపున కొనసాగుతున్న ఏకైక ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌.
కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌
మంగళవారం జస్ప్రీత్‌ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో 6/19 ప్రదర్శనతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో అతను తన కెరీర్లో అత్యుత్తమ బెస్ట్‌ బౌలింగ్‌ గణాంకాలు సాధించాడు. తాజాగా బుధవారం విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో అతను 4వ స్థానం నుంచి ఎగబాకి నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నాడు. తద్వారా ప్రస్తుతం ప్రపంచ నంబర్‌ వన్‌ బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో సెంచరీ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ ఏకంగా 44స్థానాలు ఎగబాకి 5వ స్థానానికి చేరుకుని భారత అత్యుత్తమ టీ20బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో బుమ్రా 718పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. బౌల్ట్‌ 712పాయింట్లతో రెండో స్థానంలో.. పాక్‌ పేసర్‌ షాహీన్‌ అఫ్రిది 681పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇది వరకు మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు చెందిన క్రిస్‌ వోక్స్‌ ఇప్పుడు 3నుంచి 7వ స్థానానికి పడిపోయాడు.
వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌
ఇకపోతే భారత ఆటగాళ్ల వన్డే, టీ20అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ను ఓసారి పరిశీలిస్తే.. వన్డే బౌలర్లలో టాప్‌-10లో ఉన్న ఏకైక భారత బౌలర్‌ బుమ్రా కాగా.. బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో విరాట్‌ కోహ్లి మూడో స్థానంలో, రోహిత్‌ శర్మ నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. టాప్‌ 10 ఆల్‌రౌండర్ల లిస్టులో టీమిండియా నుంచి ఎవరూ లేరు. టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక్కడే టాప్‌ 10లో ఐదో ర్యాంక్‌లో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో భువీ 8వ స్థానంలో ఉండగా.. ఆల్‌రౌండర్లలో టాప్‌-10లో ఒక్క టీమిండియా ప్లేయర్‌ లేడు.
పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టిన ఇండియా
ఇక ఇటీవల ఓవల్‌లో జరిగిన వన్డేలో ఇంగ్లండ్‌ను 10వికెట్ల తేడాతో ఓడిరచిన ఇండియా వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. మూడో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టి వన్డే టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానానికి చేరుకుంది. రేటింగ్‌ పాయింట్ల విషయంలో ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌ 105 పాయింట్లతో ఉండగా, పాకిస్థాన్‌ 106పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. తాజా విజయం ద్వారా టీమిండియా మూడు పాయింట్లు పొంది 108 పాయింట్లతో పాకిస్థాన్‌ను నాలుగో స్థానానికి నెట్టింది. ఇకపోతే ఇంగ్లాండ్‌ జట్టు 122పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. వన్డే జట్టు ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ 126పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img