Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

సెంచరీలతో చెలరేగిన కాన్వే, రచిన్‌

9 వికెట్లతో ఇంగ్లాండ్‌పై కివీస్‌ సంచలన విజయం

అహ్మదాబాద్‌: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌ గురువారం ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో ఆరంభమైంది. తొలి మ్యాచ్‌లో గత ప్రపంచకప్‌ ఫైనలిస్టులు ఇంగ్లాండ్‌ – న్యూజిలాండ్‌ జట్లు తలపడగా… డిఫెండిరగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై న్యూజీలాండ్‌ 9 వికెట్ల తేడాతో సంచలనం విజయం నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ 282 పరుగుల స్కోరు చేయగా ఈ లక్ష్యాన్ని కేవలం ఒకే ఒక్క వికెట్‌ కోల్పోయి ఆడుతూ పాడుతూ కేవలం 36.2 ఓవర్లలోనే ఛేదించింది న్యూజిలాండ్‌. ఓపెనర్‌ విల్‌ యంగ్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. అయితే డివాన్‌ కాన్వే, రచిన్‌ రవీంద్ర అజేయ సెంచరీలతో రెండో వికెట్‌కి 273 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేయడం ద్వారా కివీస్‌ ఘన విజయం అందిం చారు. వన్డే వరల్డ్‌ కప్‌లో న్యూజిలాండ్‌కి ఇదే అత్యధిక భాగస్వామ్యం. డివాన్‌ కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్లతో 152 పరు గులు చేశాడు. డివాన్‌ కాన్వేకి ఇది నాలుగో వన్డే సెంచరీ. తొలిసారి టాపార్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన రచిన్‌ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఒక వికెట్‌ కూడా పడగొట్టిన రచిన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తొలుత టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్‌ (7786 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ శతకం బాదాడు. జోస్‌ బట్లర్‌ (43 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. జానీ బెయిర్‌స్టో (33), హ్యారీ బ్రూక్‌ (25), లియామ్‌ లివింగ్‌ స్టోన్‌ (20), అదిల్‌ రషీద్‌ (15లి), డేవిడ్‌ మలన్‌ (14), సామ్‌ కరన్‌ (14), మార్క్‌ వుడ్‌ (13లి), మొయిన్‌ అలీ (11) పరుగులు చేశారు. కివీస్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 3, గ్లెన్‌ ఫిలిప్స్‌ 2, మిచెల్‌ సాంట్నర్‌ 2, ట్రెంట్‌ బౌల్ట్‌, రచిన్‌ రవీంద్ర ఒక్కో వికెట్‌ తీశారు. తుంటి గాయంతో బాధపడుతున్న ఇంగ్లాండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img