Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

టీమిండియా ఆల్‌రౌండ్‌ షో

. ప్రపంచకప్‌లో పాక్‌పై ఘన విజయం
. రోహిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌
. అర్ధసెంచరీతో అలరించిన శ్రేయాస్‌
. రాణించిన బౌలర్లు

అహ్మదాబాద్‌ : ప్రపంచకప్‌లో మహాసంగ్రామం అనుకున్న దాయాదుల పోరు సాదాసీదాగా ముగిసింది. ఇక్కడి నరేంద్రమోదీ స్టేడియంలో శనివారం భారత్‌పాక్‌ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. కేవలం 30.3 ఓవర్లలో 192 పరుగుల విజయలక్ష్యాన్ని ఊదేసింది. తద్వారా ప్రపంచకప్‌లో పాక్‌పై తన అజేయ రికార్డును పదిలపర్చుకుంది. లీగ్‌పోరులో టీమిండియా హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. ఇంతకుముందు ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్‌పై టీమిండియా గెలుపొందిన సంగతి తెలిసిందే. మరో పక్క రెండు విజయాలతో ఊపుమీదున్న పాకిస్తాన్‌ తొలి ఓటమి చవి చూసింది. ఈ మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించిన రోహిత్‌ సేన పూర్తి ఆధిపత్యం కనబర్చింది. రోహిత్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌కు తోడు మిడిల్డార్‌లో శ్రేయాస్‌ సమయోచిత ఇన్నింగ్స్‌ తోడవడంతో పాక్‌ విసిరిన 192 పరుగుల విజయ లక్ష్యం చిన్నబోయింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్‌, శుభ్‌మన్‌ గిల్‌ బ్యాటింగ్‌ ప్రారంభించగా... నాలుగు ఫోర్లు కొట్టి ఊపుమీదున్నట్లు కనిపించిన గిల్‌ షాహిన్‌ ఆఫ్రిదీ బౌలింగ్‌లో షాబాద్‌ఖాన్‌ క్యాచ్‌ పట్టడంతో వెనుదిరిగాడు. దీంతో 21 పరుగులకు టీమిండియా వికెట్‌ కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ ఓవైపు ఆచితూచి ఆడగా... మరోవైపు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. 10వ ఓవర్‌లో 18బంతుల్లో 16 పరుగులు చేసిన కోహ్లీ హసన్‌ అలీ బౌలింగ్‌లో నవాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 79/2. ఈ దశలో శ్రేయాస్‌ అయ్యర్‌ అండతో చెలరేగిన రోహిత్‌ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరో పక్క అడపాదడపా ఫోర్లు కొడుతూ శ్రేయాస్‌ మరో మారు నిలకడైన ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 80కి పైగా పరుగుల భాగస్వామ్యం నెల కొల్పారు. ఈదశలో సెంచరీ వైపు దూసుకెళుతున్న రోహిత్‌... 86 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆఫ్రిదీ బౌలింగ్‌లో ఇఫ్తిఖార్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కేవలం 65బంతుల్లో 86 పరుగులు చేసిన రోహిత్‌ ఆరు భారీ సిక్సర్లు, ఆరు ఫోర్లు కొట్టి అభిమానులను అలరిం చాడు. రోహిత్‌ ఔట్‌ అయ్యేసరికి 156/3. అనంతరం శ్రేయాస్‌ అయ్యర్‌ (62 బంతుల్లో 53 ), కేఎల్‌ రాహుల్‌ (29 బంతుల్లో 19 పరుగులు) ఆడుతూ పాడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. కేవలం 30.3 ఓవర్లలోనే టీమిండియా మూడు వికెట్లకు 192 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్‌ బౌలర్లలో షాహీన్‌ ఆఫ్రిదీ 2 వికెట్లు, హసన్‌ అలీకి ఒక వికెట్‌ దక్కింది. 7ఓవర్లలో కేవలం 19పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు పడగొట్టిన జస్పిత్‌ బూమ్రా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ జట్టు నిర్ణీత 42.5 ఓవరల్లో 191 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌(58 బంతుల్లో 50Ñ 7I4) హై స్కోరర్‌గా నిలిచాడు. మహ్మ ద్‌ రిజ్వాన్‌(69 బంతుల్లో 49Ñ 7I4), ఇమామ్‌ ఉల్‌ హక్‌(38 బంతుల్లో 36Ñ 6I4), అబ్దుల్లా షాహిక్‌(24 బంతుల్లో 20Ñ 3I4) పరుగులు చేశారు. సౌద్‌ షకీల్‌(6), ఇఫ్తీఖర్‌ అహ్మ ద్‌(4), షాదబ్‌ ఖాన్‌(2), మహ్మ ద్‌ నవాజ్‌(4), హసన్‌ అలీ(12) నామమాత్రపు స్కోర్‌ చేశారు. భారత బౌలర్లలో బుమ్రా, సిరాజ్‌, హార్దిక్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా రెండేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో భారత పేసర్లు, స్పిన్నర్లు రాణించారు. కీలక సమయాల్లో వికెట్లు తీయగలగడంతో పాక్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయగలిగారు. వారిద్దరే... తొలుత పాక్‌ ఓపెనర్లు శుభారంభం అందిం చారు. మొదటి వికెట్‌కు అబ్దుల్లా షెఫీక్‌ -ఇమామ్‌ కలిసి 41 పరుగులు జోడిరచారు. అయితే వీరి జోడీని సిరాజ్‌ విడగొట్టాడు. అబ్దుల్లా తొలి వికెట్‌గా వెనుదిరి గాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే.. ఇమామ్‌ను అద్భుతమైన బంతితో హార్దిక్‌ బోల్తా కొట్టించాడు. అనంతరం టీమిండియాపై మంచి రికార్డు కలిగిన పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌వికెట్‌ కీపర్‌ రిజ్వాన్‌ క్రీజ్‌లో పాతుకుపోయేందుకు ప్రయతించారు. మూడో వికెట్‌కు 82 పరుగులను నమోదు చేసి జట్టును పటిష్ట స్థితిలోనే నిలిపారు. దీంతో 29 ఓవర్లకు పాక్‌ 150/2 స్కోరుతో నిలిచింది. అయితే ఈ జోడీని మళ్లీ సిరాజే విడగొట్టాడు. అర్ధ శతకం సాధించిన బాబర్‌ను బౌల్డ్‌ చేసి పెవిలియన్‌ పంపాడు. ఆ తర్వాత పాక్‌ ఏ దశలోనూ కోలుకోలేదు.
37 పరుగుల వ్యవధిలో ఎనిమిది వికెట్లు
బాబర్‌ అజామ్‌ను ఔట్‌ చేసిన తర్వా త భారత బౌలర్లు మరింత రెచ్చిపోయారు. ఒకే ఓవర్లో షకీల్‌, ఇఫ్తికార్‌ను కుల్దీప్‌ ఔట్‌ చేశాడు. షకీల్‌ ఎల్బీడబ్ల్యూ అయ్యా డు. అంపైర్‌ నాటౌట్‌గా ప్రకటించినా రివ్యూ తీసుకున్న టీమిండియాకు అనుకూలంగా ఫలితం దక్కింది. అనంతరం మరికాసేపటికే కీలకమైన రిజ్వాన్‌ను, షాదాబ్‌ను తన వరుస ఓవర్లలో బుమ్రా కూడా క్లీన్‌బౌల్డ్‌ చేసేశాడు. కేవలం ఐదు ఓవర్ల వ్యవధిలో ఐదు వికెట్లను కోల్పో యి పాక్‌ చతికిలపడే దిశగా వెళ్లిపోయింది. మహమ్మద్‌ నవాజ్‌ (4), హసన్‌ అలీ (12) క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో 29.3 ఓవర్లకు 154/2 స్కోరుతో ఉన్న పాకిస్థాన్‌ జట్టు 42.5 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్‌ అయింది.కేవలం 37 పరుగుల వ్యవధిలో చివరి ఎనిమిది వికెట్లను కోల్పోయింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img