Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

వేడుకలు లేకుండానే ప్రపంచకప్‌ ఆరంభం

శ్రీ ఖాళీ కుర్చీలు.. స్టేడియం వెలవెల

అహ్మదాబాద్‌ : ప్రపంచకప్‌ ఆరంభం అంటే ప్రారంభ వేడుకలపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఆట పాటలు, సెలబ్రిటీల డ్యాన్స్‌లు, లైటింగ్స్‌, ఆకా శాన్ని తాకేలా బాణసంచాలు, స్టేడియం మొత్తం నిండిపోయిన అభిమానుల కేరింతలు… ఇలా సంబరాలు అంబరాన్ని అంటేలా ఉంటాయి. ఇక అలాంటిది వరల్డ్‌ కప్‌ భారత్‌లో జరిగితే… ఓపెనింగ్‌ మ్యాచ్‌ ప్రపంచంలోని అతిపెద్ద స్టేడి యంలో నిర్వహిస్తే… ఆ సంబరాలు ఎలా ఉంటాయి. కానీ అవేవీ లేవు. అహ్మదాబాద్‌ లో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ మొదటి మ్యాచ్‌ తూతూ మంత్రంగా ప్రారంభం అయింది. భారీ తారా గణంతో ఓపెనింగ్‌ సెర్మనీ ఉంటుంది అనుకున్న అభిమానులకు నిరాశ మిగిలింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మెగా టోర్నీ మామూలు మ్యాచుల్లా మొదలయింది. ఆరంభ మ్యాచ్‌ ను ప్రత్యక్షంగా చూసేందుకు నరేంద్ర మోదీ స్టేడియానికి భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని ఊహించారు. అయితే అది కూడా జరగలేదు. మ్యాచ్‌ మొదలై రెండు గంటలు గడిచినా కూడా స్టేడియం మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. విషయం తెలిసిన క్రికెట్‌ అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. అసలు ఇది వరల్డ్‌కప్‌ టోర్నీనేనా… మ్యాచ్‌ జరుగుతున్నది భారత్‌ లోనేనా అనే అను మానం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌కప్‌ గ్లోబల్‌ అంబాసిడర్‌ హోదాలో సచిన్‌ టెండూల్కర్‌ టోర్నీని అధికారికంగా ప్రారంభించాడనే మాట తప్ప… మిగతాదంతా నామ మాత్రంగా జరిగింది. దీంతో అభిమానులు పెదవి విరుస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డ్‌ అయిన బీసీసీఐ.. ఆరంభ వేడుక నిర్వహించలేనంత దుస్థితిలో ఉందా అని విమర్శిస్తున్నారు. అయితే అక్టోబర్‌ 14న జరిగే భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఈ ఆరంభ వేడుక ఉంటుందని కొందరు అంటున్నమాట. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img