విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పెనుజూరు కాలనీలో గల మెహర్ కుటీరంలో ఈనెల 25వ తేదీ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి అవతార్ మెహర్ బాబా 130వ అవతరణ జన్మదిన మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు అవతార్ మెహర్ బాబా ధర్మవరం సెంటర్ కార్యదర్శి పెనుజూరు రమేష్ సుజాత తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అవతార్ మెహర్ బాబా అవతరణ (జన్మదిన) మహోత్సవ వేడుకలు మెహర్ బాబా ప్రేమికుల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భగవంతుడు కపటం తప్ప ఏ ఇతర పాపములైనను క్షమిస్తాడని ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ భిన్నత్వం ఉండదని, అక్కడ కేవలం ఏకత్వం మాత్రమే ఉంటుందని తెలిపారు. భగవంతుడిని ప్రేమించడమే జీవిత లక్ష్యము అని భగవంతుడు లో ఐక్యం కావడమే జీవిత గమ్యము అని తెలిపారు. బాధలకు భయపడేవాడు ఎన్నటికీ భగవంతుణ్ణి ప్రేమికుడు కాలేడనే తెలిపారు. అవతారుడి అవతరణను సృష్టికి తెలియజేయడమే ఈ వేడుకల యొక్క ముఖ్య లక్ష్యము అని తెలిపారు. ఈ వేడుకల్లో మెహర్ బాబా సంకీర్తనలు, ముఖ్యమైన ప్రసంగాలు, మెహర్ బాబా వారి యొక్క మహిమలు, అనంతరం అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఆదివారం సాయంత్రం 6 నుండి 7:30 గంటల వరకు ప్రేమిక సహవాస కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. దీంతోపాటు ఇదే ఆదివారం మెహర్ బాబా సెంటర్ నందు ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు వృద్ధులకు వికలాంగులకు ఉచిత వైద్యముతో పాటు ఉచితంగా మందులు కూడా అందించడం జరుగుతుందని తెలిపారు. కావున అవతార్ మెహర్ బాబా అవతరణ మహోత్సవ వేడుకల్లో అధిక సంఖ్యలో మెహర్ బాబా ప్రేమికుల పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.