ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కేశగాల్ల శ్రీనివాసులు
విశాలాంధ్ర -ధర్మవరం ; 30 సంవత్సరాల శ్రమ ఫలించిందని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కేశగాల్ల శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాల నుండి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎస్సీలను ఏబిసిడిలుగా వర్గీకరణ చేయాలని ప్రధాన ఉద్దేశంతో అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అని, అందులో భాగంగా అనేకమంది మాదిగలు ప్రాణ త్యాగాలు చేయడం జరిగింది అని తెలిపారు. అనేక ఆందోళన కార్యక్రమాలతో పాటు, దేశంలోనే ఏ నాయకుడు చేయనటువంటి వేల కిలోమీటర్ల పాదయాత్ర కూడా మందకృష్ణ మాదిగ చేయడం జరిగిందన్నారు. 2000 సంవత్సరంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీ లోని అన్ని ఉపకలాలకు లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిజర్వేషన్ వర్గీకరించి, అమలు చేయడం జరిగిందన్నారు.అయితే మాల మహానాడు సుప్రీంకోర్టు వెళ్లడంతో అవి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండడంతో వర్గీకరణ అమలు చేయడానికి వీలు కాకుండా పోయింది అని తెలిపారు.అప్పటినుండి ఇప్పటివరకు మందకృష్ణ మాదిగ దేశవ్యాప్తంగా మాదిగల చైతన్య పరుస్తూ అనేక కార్యక్రమాల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తూ ,కేంద్రం దృష్టికి కూడా ముఖ్యంగా ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు ఆహ్వానించి, ఎస్సి ఉప కులాల ఆకాంక్షను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆ సభలోనే ప్రధానమంత్రి తప్పక ఎస్సీ వర్గీకరణకు మా వంతు కృషి చేస్తామని మాట ఇవ్వడం జరిగింది అని తెలిపారు. అందులో భాగంగానే నేడు సుప్రీంకోర్టులో వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలవడం యావత్తు దేశంలోని ఎస్సి ఉప కులాలు అందరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు , ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , స్థానిక మంత్రి సత్య కుమార్ యాదవ్,టిడిపి ధర్మవరం నియోజకవర్గం ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ కు కృతజ్ఞత లను తనవంతుగా తెలియజేస్తున్నానని తెలిపారు. ఏది ఏమైనా ఆగస్టు 1వ తేదీ పండుగ రోజుగా వచ్చిందని సంతోషాన్ని వ్యక్తం చేశారు.