Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

పశువుల పాకగా మారిపోతున్న బస్ షెల్టర్

బస్సు షెల్టర్ దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సిపిఐ

విశాలాంధ్ర- ఎన్ పీ కుంట: మండల కేంద్రమైన నంబుల పూలకుంట బస్టాండ్ కూడలిలో ఉన్న బస్సు షెల్టర్ ను దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మండల అధికారులపై ఉందని మండల సిపిఐ కార్యదర్శి వంకమద్ది జి రమణ పేర్కొన్నారు. బస్సు సెంటర్ ప్రజలకు ఉపయోగపడుతుందని నమ్మకంతో నిర్మించిన దానిని కొందరు మేకల, గొర్రెల కాపరులు వాటిని బస్సు షెల్టర్ లో ఉంచడంతో దుర్వినియోగం చేస్తున్నారని సిపిఐ కార్యదర్శి వివరించారు. ప్రజల అవసరాల కోసం నిర్మించిన బస్సు షెల్టర్ లోకి మేకలు, గొర్రెలు తోలడం తో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గొర్రెలు మేకలు బస్సు షెల్టర్ ఉంచడంపై మండల పంచాయతీ అధికారులకు దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం నిర్మించిన బస్సు షెల్టర్ లోకి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాల్సిన పంచాయతీ అధికారులు పట్టించుకోకపోవడంతోనే ప్రజలకు ఉపయోగపడే భవనాలు సైతం శిథిలావస్థకు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని మేకలు గొర్రెలను బస్సు షెల్టర్ లోకి ప్రవేశించకుండా గొర్రె కాపరులకు సూచించాల్సిన అవసరం పంచాయతీ సిబ్బందిపై ఉందని మండల సిపిఐ నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img