ఏపీ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యదర్శి జనరల్ కమ్మన్న
విశాలాంధ్ర ధర్మవరం:: రాష్ట్రంలో ఉన్నటువంటి రజకులు అందరూ కూడా ఐక్యమత్యంతో ముందుకు సాగినప్పుడే సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయని ఆంధ్రప్రదేశ్ రజక అభివృద్ధి సంస్థ రాష్ట్ర కార్యదర్శి జనరల్ కమ్మన తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని చెన్నకేశవ స్వామి గుడిలో సమావేశాన్ని కు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సమావేశం కొనుటూరు ముత్యాలు అధ్యక్షతన కొనసాగింది. అనంతరం ఖమ్మం నా మాట్లాడుతూ రజకులను ఎస్సీల జాబితాలో చేర్చే విషయంలో త్వరలో రాష్ట్రస్థాయిలో జరిగే సమావేశంలో కార్యచరణగా ప్రకటించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పట్టణములో మడివాల మాచి దేవుని విగ్రహం ఏర్పాటు చేయాలని అందుకు నూతనంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగా 15 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా వారు ఏర్పాటు చేశారు. నూతన కమిటీలో శ్రీ సత్య సాయి జిల్లా రజక అభివృద్ధి సంస్థ జిల్లా కార్యదర్శిగా అగ్రహారం ముత్యాలు, పట్టణ అధ్యక్షులుగా న్యామద్దల నరసింహులు లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. ఎన్నిక కాబడిన నూతన కమిటీ వారు మాట్లాడుతూ రజక అభివృద్ధికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి, అనంతపురం జిల్లా చైర్మన్ నారాయణస్వామి, శ్రీ సత్య సాయి జిల్లా చైర్మన్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి లింగార్జున, ముఖ్య నాయకులు రాధాకృష్ణ నరసింహులు తో పాటు 50 మంది నాయకులు పాల్గొన్నారు.