హిందూపురం జి ఆర్ పి పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం::: మండల పరిధిలోని చాకర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో నక్కలగుట్ట గ్రామానికి దగ్గరగా శుక్రవారం రాత్రి సమయంలో 30 సంవత్సరాలు వయసు గల ఒక మగ వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడని హిందూపురం జిఆర్పి పోలీసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాచార అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లడం జరిగిందని,, మృత దేహం వద్ద ఎటువంటి ఆధారాలు లభించడం లేదని తెలిపారు. మృతుడు వద్ద తాళముల గుత్తి ఉన్నది, తెల్లటి షర్టు, ఎరుపు నలుపు షర్టు, రెండు పొరల నల్లటి మొలతాడు కలదని తెలిపారు. చనిపోయిన వ్యక్తి వివరాలు తెలిసినవారు సెల్ నెంబర్ 9441238182 సమాచారాన్ని అందించాలని తెలిపారు..