Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri Bahis Siteleri deneme bonusu bonus veren siteler deneme bonusu veren siteler deneme bonusu veren siteler https://lexilight.com casino siteleri https://www.paletdepom.com.tr
Sunday, September 29, 2024
Sunday, September 29, 2024

ధర్మవరం రక్తదాతను అభినందించిన అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

విశాలాంధ్ర -ధర్మవరం ; ధర్మవరం పట్టణంలో రక్త బంధం ఆర్గనైజేషన్ వ్యవస్థాపకుడు కన్నా వెంకటేష్ ఆధ్వర్యంలో వందలాదిమంది రక్తము అవసరమైన వారికి ఈ ఆర్గనైజేషన్ ద్వారా రక్త దాతలు ముందుకు వచ్చి తమ మానవతను చాటుకుంటున్నారు. ఈ ప్రకారంగా కన్నా వెంకటేష్ నేతృత్వంలో అనేక రక్తదాన శిబిరంలో రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు పూర్తి దశలో పాల్గొంటూ తమ ద్వారా రక్తదానాన్ని ఇస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మవరం పట్టణంలోని శాంతినగర్ కు చెందిన చంద్రశేఖర్ రక్త బంధం ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను రక్తదాతల్ని ప్రోత్సహించుటలో ఎంతో మంచి గుర్తింపును పొందారు. చంద్రశేఖర్ చేస్తున్న సేవను
అనంతపురం జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్ అభినందించి, శుభాకాంక్షలు తెలుపుతూ వారి చేతుల మీదుగా జ్ఞాపికను అందుకొని, ఘనంగా సన్మానించడం జరిగింది. తదుపరి కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ మీరు మీ సంస్థ రక్త బంధం ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ సంస్థతో కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకొనుటలో సహకరించినందుకు మీకు జ్ఞాపకం అందజేస్తూ సన్మానిస్తున్నాం అని తెలిపారు. అనంతరం రక్త బంధం ఆర్గనైజేషన్ సభ్యులు చంద్రశేఖర్ మాట్లాడుతూ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి మా సంస్థ రక్తదాతలునీ ప్రోత్సహిస్తున్నందున జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ చేతుల మీదుగా నన్ను ఘనంగా సన్మానించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.ఆపద సమయాల్లో అవసరమైన వారికి మానవతా దృకల్పంతో స్వచ్ఛంద రక్తదానం నకు సమాజంలో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని కోరారు .18 సంవత్సరాలు నిండి కనీసం 50 కేజీలు బరువు కలిగిన వారు ఎవరైనా లింగ బేధం లేకుండా ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వచ్ఛంద రక్తదానం చేయవచ్చునని తెలిపారు. ప్రతి మనిషి మానవత దృకల్పంతో ముఖ్యంగా యువతీ, యువకులు ముందుకు రావాలని రక్తదానం మానవతకు సంకేతమని, మనిషి ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఆపద సమయాల్లో ఉన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు రక్త సహాయం అవసరమవుతుందని ఈ రక్త సహాయం మనిషికి మానవత్వంతో స్పందిస్తే తప్ప, ఏ షాపుల్లోనూ ఏ మాల్ లోను లభించదు అని తెలిపారు. కావున ప్రతి మనిషి స్వచ్ఛందంగా రక్తదానం చేసి,ఆపదలో ఉన్నవారికి అండగా నిలవాలని, దీంతోపాటు
ప్రాధాన్యతను తెలిపారు. తదుపరి రక్త బంధం ఆర్గనైజేషన్ కన్నావెంకటేష్ కూడా చంద్రశేఖర్ ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాపు రామచంద్రారెడ్డి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img