విశాలాంధ్ర-ధర్మవరం : రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సి ఎమ్ పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ధర్మవరం లో జనసేన సభ్యత్వం లను పలువురిని చేర్పించడం లో రికార్డు సృష్టించిన ధర్మవరం జనసేన నాయకులు అరిగెల భాస్కర్ కు 500 మందికి పైగా సభ్యత్వం చేర్పించిన జాబితా లో ఎంపిక చేయడం జరిగింది. జనసేన పార్టీ ఆశయాలు నిజం చేయడం కోసం మా అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ధర్మవరం లో లక్ష్యం నెరవేర్చా మని భాస్కర్ ఈ సందర్బంగా తెలిపారు. తనకు ఈ ప్రశంస రాష్ట్ర జనసేన కార్యాలయం నుండి లభించిందని వారికి తన కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ సందర్బంగా భాస్కర్ మాట్లాడుతూ ఈ క్రియా శీలక సభ్యత్వం చేయడం వలన రూ 5 లక్షలు భీమా సౌకర్యం ఉందని,ప్రమాద బీమా సౌకర్యం, పార్టీ అనుసంధానం ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభ్యత్వం నమోదు కార్యక్రమం విజయవంతం అవుతుందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సభ్యత్వాలను చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ధర్మవరంలోని జనసేన నాయకులు,కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.