విశాలాంధ్ర- ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ ఎమ్మెల్యే సవిత ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో బీసీ ఉద్యోగులు ఈశ్వరయ్య, బలరాముడు, ముత్యాలప్ప ,ఉరుకుందప్ప, మల్లికార్జున, ఆకులేటి వెంకటేశ్వర్లు, ప్రకాష్, చంద్రశేఖర్, బండి శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.