విశాలాంధ్ర -పెనుకొండ : స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు లో మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మిఠాయిలు పంచి పెట్టారు. పలు చోట్ల బాణాసంచా కాల్చి, సంబరాలు జరుపుకొని అనంతరం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు న్యాయమే గెలిచిoదని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.