విశాలాంధ్ర -పెనుకొండ : పెనుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్, శరాఘవన్, తన కార్యాలయానికి పెనుకొండ టౌన్ లోని ఆటో డ్రైవర్లను పిలిపించి వారికి ఓవర్ లోడ్ ప్యాసింజర్లు గురించి హెచ్చరించడమైనది, అదేవిధంగా ప్రతి ఆటో డ్రైవర్ లైసెన్స్ మరియు ఆటో ఇన్సూరెన్స్ కలిగి ఉండా లనితెలిపారు, ముఖ్యముగా ఆటో డ్రైవర్లు అమ్మాయిల పట్ల లేదా వారి ఆటోలో ఎవరైనా అమ్మాయిలను తీసుకుని పోవడం లాంటివి చేసినచో వారి పైన కఠినమైన చర్యలు తీసుకోబడును అని తెలియజేశారు అమ్మాయిలు ఆటోలో ఎక్కితే జాగ్రత్తగా ఉండాలని తెలిపారు, ఆటో డ్రైవర్ల లైసెన్స్ మరియు ఇన్సూరెన్స్ కొరకు వారికి ఏమైనా సహాయం కావాల్సిన దానికి సహాయం చేస్తామని తెలియజేస్తూ ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని తెలియజేశారు.