విశాలాంధ్ర- ధర్మవరం:: పట్టణంలోని కాకతీయ విద్యా నికేతన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాల యందు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సంబరాల్లో భాగంగా శ్రీ సత్య సాయి జిల్లా యుటిఎఫ్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెస్ పోటీలు ఈనెల 10వ తేదీ నుండి 11వ తేదీ వరకు రెండు రోజులు పాటు ఘనంగా నిర్వహించామని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపీ జయ చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షులు జిహెచ్. బాబు, ఆడిట్ కమిటీ మెంబర్ రామకృష్ణనాయక్, సీనియర్ నాయకులు నారాయణస్వామి, చెన్నకేశవులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతోపాటు చెస్ క్రీడా ఎంతో ముఖ్యమైన క్రీడా అని వారు తెలిపారు. చెస్ ఆడటం వల్ల మెదడుకు పదును కలుగుతుందని తెలిపారు. ఈ చెస్సు విజేతలుగా గెలుపొందిన వారు సెప్టెంబర్ మాసంలో గుంటూరు నందు జరగబోవు రాష్ట్రస్థాయి యుటిఎఫ్ స్వర్ణోత్సవాల పోటీలకు అర్హత సాధించడం జరిగిందని తెలిపారు. మహిళా టీచర్స్ విభాగములో విజేతలు:: ఎస్ సబిహా భాను-అమలాపురం, పి సీతారత్నం- ఎన్ పి కుంట, ఎం. దుర్గా- ధర్మవరం, పురుష టీచర్స్ విభాగంలో విజేతలు:: బి. శివకృష్ణ- కేశపురం- కొత్తచెరువు మండలం, ఎం. జయచంద్ర- గుడిబండ, వై శ్రీనివాసరెడ్డి, హిందూపురం మండలం- లేపాక్షి, ఎస్. లక్ష్మీనారాయణ స్వామి- చేనేకొత్తపల్లి అను విజయదలకు మెమొటోలు బహుమతులను యుటిఎఫ్ జిల్లా నాయకత్వం అందజేసింది అని తెలిపారు. ఈ చెస్ పోటీలకు న్యాయ నిర్ణయితలుగా ఎస్. ఆది రత్నాకర్, పి. కిషోర్ కుమార్, కే. సోమశేఖర ప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్లు రమేష్ నాగేంద్ర, యుటిఎఫ్ జిల్లా నాయకత్వం వహించడం జరిగిందన్నారు.