విశాలాంధ్ర ధర్మవరం : ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి మండలంలో నిడిమామిడి మఠం భూమి సర్వే నెంబర్ 401 ను అక్రమంగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అనుచరుడు దర్జాగా తాసిల్దార్ కార్యాలయం ద్వారా దొంగ పట్టా పొందారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా ఈ మఠం భూమిని కాపాడేందుకు సిపిఐ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు పోరాటాలు సరిపడం జరిగింది. ఇటీవలే సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా స్వయంగా బత్తలపల్లి కి వచ్చి, ఈ సర్వే నెంబర్ పై పూర్తి వివరాలు తెలుసుకొని, పోరాటాలు కూడా చేయడం జరిగింది. పేద ప్రజలకు పట్టాలు ఇదేవిధంగా వారు ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే బుధవారం మంగళగిరిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడుని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు కలవడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి బత్తలపల్లి నిడిమామిడి మఠం భూమి సర్వేనెంబర్ గూర్చి పూర్తి వివరాలను తెలియజేశారు. దౌర్జన్యంగా పట్టా పొందిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అనుచరుడిపై వెంటనే చర్యలు చేపట్టాలని తెలిపారు. అంతేకాకుండా పలు రకాలుగా సంబంధిత అధికారులకు కూడా స్థానిక సిపిఐ నాయకులు వినతి పత్రాలను కూడా సమర్పించడం జరిగిందన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రికు తెలియజేశారు. అంతేకాకుండా ఆ భూమి పిత్రార్జితం అన్నట్టు రికార్డులను సృష్టించడం ఆశ్చర్యానికి గురిచేసింది అన్న విషయాలు కూడా వారు గుర్తు చేశారు. కోటి రూపాయల విలువ చేసే భూమిని కబ్జా చేయాలన్న ఉద్దేశంతో ఈశ్వర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులతో పాటు ఇతరులను కూడా చేర్చడం జరిగిందని, కావున వెనువెంటనే చర్యలు చేపట్టాలని వారు ముఖ్యమంత్రి కి తెలియజేయడం జరిగింది. బత్తలపల్లి లోని నిడిమామిడి మఠం చెందిన 20 ఎకరాలలో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని తెలపడం జరిగిందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కూడా స్పందించడం జరిగిందని, సానుకూలంగా వ్యక్తపరిచారని తెలిపారు. మొత్తం మీద 20 ఎకరాల భూమిని సిపిఐ పోరాటాలు సలిపి, కచ్చితంగా పేద ప్రజలకు పట్టాలు ఇస్తుందన్న ఆశాభావం పేద ప్రజల్లో ఉంది. ఇందుకుగాను నియోజకవర్గ ప్రజలు కూడా సిపిఐ చేస్తున్న పోరాటాల పట్ల హర్షాతిరేకాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.