విశాలాంధ్ర ధర్మవరం:: అనంతపూర్ జిల్లా తాడిపత్రిలో జరిగిన పదవ రీజినల్ లెవెల్ అబాకస్ పోటీలలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం విద్యార్థులు తమ ప్రతిభను చాటుకోవడం జరిగిందని మిరాకిల్ ఎడ్యుకేషన్ సెంటర్ డైరెక్టర్ శ్రీ వాణి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ అబాకస్ పోటీల్లో 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్, ఎంఈఓ నాగరాజు టోపీలను అందజేయడం జరిగిందని తెలిపారు. ఇందులో ధర్మవరం విద్యార్థులలో దివేష్, లోహిత్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్ సాధించగా, పలశృతి, మేఘంస్, బ్రీ తిక, ఛాంపియన్ కాగా, సాయి నిత్య, అజయ్, వాన్నాయి, ఆదిత్య, మోనిత్, కీర్తి, మోక్షజ్ఞ, గౌరవ్, ఆరాధ్య, జయదీ ఫ్, మోనిషా, ధన్విన్, తేజేష్, రిత్విక్ టాపర్స్ సాధించడం జరిగిందని తెలిపారు.