Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

కళాశాల లైబ్రరీకి పుస్తక అరలు వితరణ

విశాలాంధ్ర-పెనుకొండ : పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రరీకి అభయ ఫౌండేషన్, హైదరాబాద్ వారు దాదాపు రెండు లక్షల విలువచేసే పుస్తకాలను ఉంచే 10 ఇనుప అరలను వితరణగాంచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. కే. జయప్ప తెలిపారు. కియా కంపెనీ, ఇటీవల కళాశాలలో నిర్మించిన నూతన గ్రంథాలయంలో పుస్తకాలను పెట్టుకోవడానికి తగినన్ని ఆల్మరాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్న వైనాన్ని సాహితీ గగన్ మహల్ ట్రస్ట్ అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది ప్రతాపరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా విషయాన్ని వెంటనే అభయ ఫౌండేషన్ ద్వారా పరిష్కరించారన్నారు.
కళాశాల గ్రంథాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అభయ ఫౌండేషన్ చైర్మన్ బాలచందర్ సుంకు పుస్తక ర్యాక్ లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదనంతరం మాట్లాడుతూ ఁవిద్యార్థులుమొబైల్ వాడకాన్ని తగ్గిస్తూ పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులకు అవసరమయ్యే మరిన్ని పుస్తకాలను కూడా త్వరలో బహుకరిస్తామన్నారు. ప్రముఖ న్యాయవాది ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఁ విద్యార్థుల ఉన్నతి కోసం దాతల సహకారంతో తమ వంతు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ శ్రీనివాసులు, అధ్యాపకులు. ప్రతాప్ , డా. ఓబిలేసు, రంగనాయకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img