విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని సుందరయ్య నగర్ లో గల శ్రీ గణేష్ పురపాలక ప్రాథమిక పాఠశాలలోని 400 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి ఆరు నోటు పుస్తకాలు పెన్నులు, పెన్సిళ్లు, క్రేయన్స్ పలకలను కీర్తిశేషులు మడకం చౌడయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు మడకం చందు 50 వేల రూపాయలు విలువైన విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారిని రాజేశ్వరి దేవి హాజరు కావడం జరిగింది. అనంతరం మడకం చందు, భాను ప్రసాద్ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా కీర్తిశేషులు మడకం చౌడయ్య పేరుతో ఇటువంటి కార్యక్రమాన్ని తాము చేయడం, ఆనవాయితీగా వస్తుందని, మాకెంతో సంతోషంగా ఉందని తెలిపారు. అనంతరం ఎంఈఓ రాజేశ్వరి దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు షర్ఫుద్దీన్ మాట్లాడుతూ ఇలాంటి సేవా గుణాన్ని భవిష్యత్తులో విద్యార్థులు కూడా అలవర్చుకోవాలని, ఈ విద్యా సామాగ్రి కార్యక్రమం పంపిణీ చేయడం పట్ల దాతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.