రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్
విశాలాంధ్ర ధర్మవరం;; అనంతపురం పట్టణంలోని వినాయక నగర్ కు చెందిన రమేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. మృతి చెందిన వ్యక్తికి అప్పుడే ఆరువేల రూపాయల ఆర్థిక సహాయమును ప్రస్తుత వారు అందించారు. తదుపరి నిత్యవసర సరుకులను మృతుని తల్లి శ్రీలత కుటుంబ సభ్యులకు 7వేల రూపాయలు విలువచేసే సరుకులను అందజేశారు. ప్రస్తుతం మృతి చెందిన తల్లి ఒంటరి మహిళ కావడంతో నెలకు సరిపడా సరుకులను ఇవ్వడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు చంద్రశేఖర్, సదానంద, కుమార్, నజీర్ తదితరులు పాల్గొన్నారు.