మూడు లక్షలు నష్టం వాటిల్లిందంటూ బాధితుడు ఆవేదన
విశాలాంధ్ర ధర్మవరం:: మండల పరిధిలోని రావులచెరువు గ్రామం గొర్రెల కాపరులు వెంకటనారాయణ బాలకొండ నారాయణస్వామి సుధాకర్ ముగ్గురూ కలిసి 40 గొర్రె పిల్లలను పెంచుతూ జీవనం కొనసాగించేవారు. కానీ గ్రామంలోని కుక్కలు అకస్మాత్తుగా 40 గొర్రె పిల్లలపై దాడి చేసి గొంతు కొరికి చంపేశాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మేము ఉదయమే పిల్లలను గూడు కింద వేసి గొర్రెలను మేత కోసం తోలుకొని వెళ్ళామని, తాము లేని సమయం చూసి కుక్కలు గూడు కింద తోడి అందులో ఉన్న 40 పిల్లలను గొంతు కొరికి చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. తదుపరి ఎన్డీఏ కూటమి నాయకుడు చెన్నారెడ్డి అక్కడికి వెళ్లి వాటిని పరామర్శించి విషయాన్ని ఎమ్మెల్యే, మంత్రి సతీష్ కుమార్ యాదవ్ కు, నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్కు సమాచారాన్ని అందజేశారు. తదుపరి వారు మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుడు మాట్లాడుతూ దాదాపు నాకు 3 లక్షల వరకు నష్టం వాటిల్లిందని ప్రభుత్వమే స్పందించి నష్టపరిహారం చెల్లించేలా చర్యలు గైకొనాలని వారు కోరారు.