విశాలాంధ్ర ధర్మవరం:: (శ్రీ సత్య సాయి జిల్లా) పట్టణంలోని బాబు జగ్జీవన్ రామ్ నగర్ లో గల ప్రధాన గ్రంథాలయంలో ఈనెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు 56వ గ్రంథాలయ వారోత్సవాలను అత్యంత వైభవంగా విజయవంతంగా నిర్వహించినట్లు గ్రంథాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి తెలిపారు. ఈ సందర్భంగా చివరి రోజు సోమవారం విద్యార్థులకు వివిధ పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ గోపాల్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఎంఈఓ గోపాల్ నాయక్ మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థి దశమించే అందరూ కూడా ఇక్కడ దొరికే పుస్తకాలను సద్వినియోగం చేసుకుంటే, జీవితం బంగారు భవిష్యత్తుగా ఉంటుందని తెలిపారు. పాఠశాల, కళాశాల, హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాల్ లు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అందరూ కూడా విద్యార్థుల్ని గ్రంధాలయం వైపు వచ్చేలా ప్రోత్సహించారని తెలిపారు. అనంతరం వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులను ఎంఈఓ చేతులు మీదుగా అందజేశారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించిన అందరికీ కూడా గ్రంధాలయ అధికారిని అంజలి సౌభాగ్యవతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివ, కాంతమ్మ ,మురళి, ముత్యాలప్ప, ఎల్ఐసి నాగరాజు, నారాయణస్వామి, గ్రంధాలయ సిబ్బంది శివమ్మ, రమణ నాయక్, గంగాధర్, ముకుంద, అధిక సంఖ్యలో పాఠకులు, విద్యార్థులు 200 మంది పాల్గొన్నారు.