అభినందించిన మైసూర్ దత్త పీఠం గణపతి సచ్చిదానంద స్వామీజీ
విశాలాంధ్ర- ధర్మవరం ; శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలోని శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు బాబు బాలాజీ, కమలా బాలాజీ, రామలాలిత్యా శిష్య బృందం 25 మంది మైసూర్ లోని దత్త పీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆశ్రమంలో శ్రీ కృష్ణాష్టమి పండుగ సందర్భంగా”కృష్ణం వందే జగద్గురుం”అనే కూచిపూడి నృత్య నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ధర్మవరం దత్త శివ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని గురువు బాబు బాలాజీ తెలిపారు. ఈనాటిక ప్రదర్శన స్వామీజీ తో పాటు వందలాదిమంది భక్తాదులను విశేషంగా ఆకట్టుకోవడం జరిగింది. తదుపరి గురువులను శిష్యులను సచ్చిదానంద స్వామీజీ అభినందన శుభాకాంక్షలు తెలుపుతూ, ఆశీస్సులను అందజేసి వారి చేతుల మీదుగా జ్ఞాపికలను అందుకున్న రు. అనంతరం ఘనంగా నాట్య గ్రంథమును గురువులను స్వామీజీ సత్కరించారు. మొత్తం మీద ధర్మారంలోని శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువులు వారి శిష్య బృందం జిల్లాలోని కాక ఇతర రాష్ట్రాలలో ధర్మవరం పేరు ప్రజలు, అధికారులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.