విశాలాంధ్ర -ధర్మవరం:: మండల పరిధిలోని దర్శనమల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేగాటిపల్లి లో గల బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో దర్శనమల వైద్యాధికారి డాక్టర్ దిలీప్ కుమార్ తో పాటు వైద్య సిబ్బంది సందర్శించడం జరిగింది. ఇందులో భాగంగా 363 మంది బాలురకు హిమోగ్లోబిన్ టెస్టులను వారు నిర్వహించారు. అనంతరం వైద్యులు మాట్లాడుతూ ఎత్తు, బరువు చూడడం జరిగిందని, చిరు వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు వ్యాధుల చికిత్సలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. తదుపరి ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను కూడా ఉపాధ్యాయులకు విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రెడ్డి, హెల్త్ అసిస్టెంట్లు ఆంజనేయులు, సత్యనారాయణ, ఎంఎల్ హెచ్పి లు అశ్విని, అఖిల, భారతి, భాను, హేమలత, పరిమళా పాల్గొన్నారు.