London Escorts sunderland escorts 1v1.lol unblocked yohoho 76 https://www.symbaloo.com/mix/yohoho?lang=EN yohoho https://www.symbaloo.com/mix/agariounblockedpvp https://yohoho-io.app/ https://www.symbaloo.com/mix/agariounblockedschool1?lang=EN
Monday, October 7, 2024
Monday, October 7, 2024

బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి..

రాష్ట్ర నాయకులు నాగరాజు, జిల్లా అధ్యక్షులు శంకర
విశాలాంధ్ర- ధర్మవరం:: బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడుతూ ఐక్యమత్యముతో సమస్యలను పరిష్కరించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు నాగరాజు జిల్లా అధ్యక్షులు శంకర పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్జీవో హోములో బీసీ ఉద్యోగులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘానికి తీసుకోవలసిన విధివిధానాలు, సమస్యలు పరిష్కరించుకోవలసిన అంశాలపై వారు వివరించారు. అనంతరం ధర్మవరం కమిటీని రాష్ట్ర నాయకుడు, జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎంపిక జరిగింది. అధ్యక్షులుగా బండి వెంకటేష్, ఉపాధ్యక్షులుగా రవి, కార్యదర్శిగా జంగమన్న తో పాటు కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఎన్నికైన నూతన కమిటీ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం అభివృద్ధికి పాటుపడతామని, బీసీ ప్రజల సమస్యలను చట్టపరంగా ప్రభుత్వము అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి పోరాడుతామని తెలిపారు. అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళతామని, బీసీలకు ఎక్కడా ఎటువంటి అన్యాయం జరగకుండా ఎల్లప్పుడూ అండదండలుగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమములో బోయ రవిచంద్ర, కోటి వెంకటేశు, చాకలి నరసింహులు, జంగమన్న, అధిక సంఖ్యలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img