జగన్ ఓడితేనే మన మనుగడ
- ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్
బత్తలపల్లి: నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఏమి చేయలేకపోయామని జగన్ ప్రభుత్వం రావాల్సిన నిధులన్నీ దొడ్డిదారిన మళ్లించి ఉత్సవ విగ్రహాలుల తయారు చేసిందని అనంతపురం ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల భూషణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఓట్లు వేసిన ప్రజలతోనే చీ కొట్టించుకునే పరిస్థితి ఏర్పడిందని అయితే వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిస్తేనే మన మనుగడ తప్పదని అధికార ప్రతిపక్ష సర్పంచులు ఇతర ప్రజా ప్రతినిధులు ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు. అసమర్థులు, చేతగాని వారిలా క్షేత్రస్థాయిలో గ్రామాల వారిగా ప్రజల చేత మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కావున వచ్చే ఎన్నికలలో జగన్ ఓడించాలని ఆయన మళ్లీ గెలిస్తే పల్లెలన్నీ శిథిలమైపోతాయన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు కనీసం వీధిలైట్లు తాగునీరు అందించలేని పరిస్థితికి వచ్చామన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా నడుం బిగించి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.