విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణంలోని రామ్ నగర్ కు చెందిన నీలూరి మహేష్ వారి కూతురికి నీలూరి లిఖిత ఆరోగ్యం బాగాలేదని బెంగళూరు ప్రైవేట్ హాస్పిటల్ లో అడ్మిషన్ అయినారన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే రజిని హెల్పింగ్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ట్రస్ట్ సభ్యులు తెలిసిన వెంటనే దాతల సహకారంతో దాదాపు 30 వేల రూపాయలను స్వయంగా బెంగళూరు ఎస్టీ జాన్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లోకి వెళ్లి నగదును అందజేశారు. అనంతరం చిన్నారి నీలూరి లింగతను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యం చెప్పడం జరిగిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. నీలూరి నిఖితకు దాతగా సహాకరించిన పూజారి గోపాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రజిని హెల్పింగ్ హాండ్స్ చారిటబుల్ ట్రస్ట్, రక్త బంధం ఆర్గనైజేషన్ ట్రస్ట్ సభ్యులు కన్నా వెంకటేష్, ట్రస్ట్ సభ్యులు చంద్రశేఖర్ ఉదయ్ కుమార్, జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.