రాయలసీమ ద్రోహి జగన్
విశాలాంధ్ర -పెనుకొండ : పట్టణ కేంద్రంలోని తెదేపా కార్యాలయం నందు టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాయలసీమ లో పర్యటించే అర్హత కూడా కోల్పోయిన తరుణం లో మంగళవారం పుట్టపర్తి లో జగన్ రెడ్డి పర్యటనను నిరసిస్తూ మొదట రాయలసీమసమాజానికి ,రైతాంగానికి సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము . తీవ్ర కరువు ,దుర్భిక్ష పరిస్థితులు ఉన్న తరుణం లో కనీసం రైతులను ఆదుకొని ఈ వైస్సార్సీపీ ప్రభుత్వం ఏ మొహం పెట్టుకొని రాయలసీమ లో పర్యటిస్తున్నారు అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాయలసీమలో పర్యటించే అర్హత లేదని వైసిపి ప్రభుత్వం పై ధ్వజమెత్తారు వైసిపి నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు కళ్ళు లేని కబోదులు మాదిరి వ్యవహరిస్తున్నారని రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను ముఖ్యమంత్రి తెలియజేయడంలో వైసీపీ నాయకులు విఫలమయ్యారని ముఖ్యమంత్రి కూడా రైతులను పట్టించుకునే పరిస్థితిలో లేడని దుయ్యబట్టారు ఆమెతో పాటుగా తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.