విశాలాంధ్ర -ధర్మవరం : ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీసులో మంచి సేవలు చేసినప్పుడే రిటైర్మెంట్ అయినప్పుడు మంచి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ యునాని వైద్యాధికారి డాక్టర్ ఖాదర్, ఎస్. చంద్రయ్య, ఆర్టిఏ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షులు గోపి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రి విభాగములో గల ప్రభుత్వ యునాని వైద్యశాల యందు కాంపౌండర్ గా విధులు కొనసాగిస్తున్న పి. వెంకటరమణ పదవి విరమణ గావించారు. ఈ సందర్భంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. అనంతరం తోటి ఉద్యోగులు అధికారులు పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు. అనంతరం డాక్టర్ ఖాదర్, చంద్రయ్య, శ్రీనివాసులు గోపి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో ప్రజలకు మంచి సేవలు కొనసాగించాలని, వారి ఆప్యాయత, అనురాగాలకు వైద్య సేవలు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తాయన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో సర్వీస్ చేసినప్పుడు మంచి, చెడులు, కష్టాలు, సుఖాలు, సర్వసాధారణంగా ఉంటాయని, కుటుంబ సభ్యులు సహకరించినప్పుడే ప్రభుత్వ ఉద్యోగి తన సర్వీసులో విజయాన్ని సాధిస్తాడని తెలిపారు. అంతేకాకుండా తోటి ఉద్యోగుల పట్ల సమన్వయంతో విధుల యొక్క సేవలను నిర్వర్తించినప్పుడే నిరంతరం విజయం చేకూరుతుందని తెలిపారు. అనంతరం కాంపౌండర్ వెంకటరమణను అందరూ కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ జిఏ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ఎల్ఐసి ఏజెంట్ రాజశేఖర్, ధర్మవరం గౌరవ అధ్యక్షులు చెన్న ఆదినారాయణ అధ్యక్షులు చోలిగాళ్ళ కొండప్ప ఏరియా హాస్పిటల్ సిబ్బంది, ఎక్సరే ఆఫీసర్ రామ్మోహన్, ఫార్మసీ గ్రేడ్ వన్ క్రిష్టప్ప, భాస్కర్, దాసరి వెంకటేశులు, తదితరులు పాల్గొన్నారు.