విశాలాంధ్ర ,ఎన్ పీ కుంట: తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యుల సలహా సూచనల మేరకు సమయానికి ఆరోగ్య పరీక్షలు తప్పకుండా చేయించాలని నంబల పూలకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యరాలు డాక్టర్. అయేషా అన్నారు. బుధవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన పి. యం. ఎస్. యం. ఏ. కార్యక్రమం లో భాగంగా పి. హెచ్. సి. పరిది లో ఉండే గర్భిణీ స్త్రీలకు అధిక రక్తపోటు, మధు మేహం, హిమోగ్లోబిన్, బరువు తూచడం మొదలగు రక్త, మూత్ర పరీక్షలు ద్వారా ఆరోగ్య సమస్యలు నిర్దారించి అవసరమైన మందులు, మాత్రలు, సలహాలు, ఆరోగ్య సూచనలు గర్భిణీ స్త్రీలకు ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు తరచు నిర్వహించే ఆరోగ్య పరీక్షల వల్ల తల్లిబిడ్డ సంక్షేమశీ సాధ్యపడుతుందని, ఫలితంగా ఆరోగ్యకరమైన శిశువు జన్మించిముందు తరాలకు వ్యాధుల రహిత సమాజం సాధ్యపడుతుందని డాక్టర్. అయేషా తల్లులకు హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సి. హెచ్. ఓ. నాగలక్ష్మి, పి. హెచ్. న్. శాంతమ్మ, ఆరోగ్య పర్యవేక్షకులు కె. మహేశ్వర రెడ్డి, రాధమ్మ, ల్యాబ్ టెక్నీషియన్ విజయ్ భాస్కర్ నాయక్, యం. హెచ్. పి. లు కె. గీతారాణి, నీలు మోల్, దేవి ప్రియాంక ఆశాలు కవిత, నరసమ్మ, లక్ష్మి దేవి పాల్గొన్నారు.