ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; డివిజన్ పరిధిలోని మండలాలలో గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షపాతంలలో ధర్మవరం 29.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగిందని ఆర్డిఓ వెంకట శివరామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు డివిజన్లోని మండలాల్లో కురిసిన వర్షపాతం వివరాలను తెలుపుతూ ధర్మవరంలో 29.4 మిల్లీమీటర్లు, బత్తలపల్లి లో 18.6, తాడిమర్రిలో 18.4, ముదిగుబ్బలో 8.6, కనగానపల్లిలో 18.6, చెన్నై కొత్తపల్లి లో 5.6, రామగిరి లో 14.8 మొత్తం వర్షపాతం 114.0 మిల్లీమీటర్లు నమోదు కావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ గోపాల్ పాల్గొన్నారు.