బటన్ నొక్కుతూ ప్రజలను మోసం చేస్తున్నా జగన్
విశాలాంధ్ర- పెనుకొండ :పట్టణంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహకా కార్యదర్శి సవితమ్మ మరియు టిడిపి నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన భాగంగా సీఎం గో బ్యాక్ సీఎం డౌన్ డౌన్ అంటూ నల్ల బెలూన్ లతో ఎన్టీఆర్ సర్కిల్లోనిరసనతెలియజేస్తుండగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అసలైన రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఉత్తుత్తి బటన్ లో నొక్కడానికి జగన్ రెడ్డి కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు చేసి నేడు పుట్టపర్తికి రావడం దుర్మార్గం.రాయలసీమకు ఏమి చేశావని అంటూమండిపడ్డారు.
రైతులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు రాయలసీమ జిల్లాలో కరువు పరిస్థితులు జగన్‍కు కనిపించట్లేదా? ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రైతులను మోసం చేస్తున్నారు, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా సాగు, తాగునీరు అందిస్తామన్న హామీ ఏమైందదని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కుతున్న బటన్ రెడ్డికి ప్రజలు బటన్ నొక్కి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసారు ఆమెతో పాటుగా తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.